వందల కోట్ల సినిమాల్లో నటించినా పాపం ఆమెను ఎవరూ పట్టించుకోరేం?

మొన్న సంక్రాంతి కి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య మరియు నందమూరి బాలకృష్ణ వీర సింహా రెడ్డి సినిమాల్లో హీరోయిన్ గా నటించిన ముద్దు గుమ్మ శృతి హాసన్ యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ యొక్క కూతురు అయిన శృతి హాసన్ అనే విషయం తెల్సిందే.

ఆ మధ్య టాలీవుడ్‌ లో వరుసగా సినిమా లు చేసి సందడి చేసింది.

సంక్రాంతి కి ఇద్దరు స్టార్ హీరో లకు జోడి గా నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చి రెండు సినిమా లతో కూడా వంద కోట్లకు పైగా వసూళ్లు సొంతం చేసుకుని ఆశ్చర్య పరిచింది.

ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా రూపొందుతున్న సలార్ సినిమా లో నటిస్తోంది.

కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్‌ ఆ సినిమా కు దర్శకత్వం వహిస్తున్న విషయం తెల్సిందే.

"""/"/ హిందీ లో కూడా ఒకటి రెండు సినిమాల్లో నటిస్తోంది.ప్రస్తుతానికి ఎక్కువ సినిమా ఆఫర్స్ లేక పోవడంతో వెంటనే ఏదైనా సినిమా ను కమిట్ అవ్వాలని శృతి హాసన్ ప్రయత్నాలు చేస్తుండట.

కానీ ఆమె వద్దకు సరైన స్క్రిప్ట్ రాక పోవడంతో కొత్త సినిమాలేవి ఈ మధ్య కాలం లో ఓకే చేయలేదట.

తెలుగు లో వరుసగా సినిమాలు చేయాలని కోరుకుంటున్నా అడ పాదడపా సీనియర్ హీరో లకి మాత్రమే జోడిగా నటించే అవకాశాలను సొంతం చేసుకుంటుంది.

యంగ్ హీరోలు ఈమె ని పట్టించుకోవడం లేదు. """/"/మరో వైపు తమిళం లో కూడా ఈమె కు ఆశించిన స్థాయిలో సక్సెస్ రావడం లేదు.

సక్సెస్ దక్కినా కూడా ఆఫర్లు పెరగడం లేదు.ఇక హిందీ లో సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లను కూడా ఈమె చేస్తుంది.

దాంతో వరుసగా హిందీ సినిమా ఛాన్స్‌ లు వస్తాయని ఆశించినా కూడా పెద్దగా ఫలితం లేదు.

మొత్తానికి శృతి హాసన్ వందల కోట్ల వసూళ్లు నమోదు చేసిన సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా పేరు దక్కించుకున్నా కూడా ఆఫర్స్ విషయానికి వచ్చేప్పటికి వెతుక్కోవాల్సి వచ్చింది.

అలాగే వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.ముందు ముందు అయినా శృతి హాసన్ కి ఈ పరిస్థితి తప్పుద్దేమో చూడాలి.

సీనియర్ హీరోలతో సినిమాలు చేసిన ఏకైక డైరెక్టర్ గా అనిల్ రావిపూడి నిలుస్తాడా..?