స్టాండ్స్ లో చిన్నపిల్లలా ఏడ్చేసిన స్టార్ హీరోయిన్.. వీడియో వైరల్!

ఇటీవలి కాలంలో క్రికెట్ మైదానాల్లో అభిమానుల భావోద్వేగాలు వైరల్ వీడియోలుగా మారిపోతున్నాయి.తమ అభిమాన టీమ్ గెలిచినప్పుడు ఆనందంతో ఉక్కిరి బిక్కిరయ్యే వీక్షకులు, ఓడిపోయినప్పుడు మాత్రం కన్నీటి పర్యంతమయ్యే సన్నివేశాలు తరచూ సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.

ముఖ్యంగా ఐపీఎల్ లాంటి పెద్ద టోర్నీలో ఫ్యాన్స్ ఇమోషన్స్ మరింతగా బయటపడుతున్నాయి.తాజాగా ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ ఓటమితో ఓ స్టార్ హీరోయిన్ కంటతడి పెట్టిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అపజయాల పరంపర కొనసాగుతోంది.తాజాగా హోం గ్రౌండ్ చెపాక్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) చేతిలో చెన్నై ఓటమి పాలైంది.

ఈ మ్యాచ్ లో చెన్నై టీమ్ పరాజయాన్ని తట్టుకోలేక ఓ స్టార్ హీరోయిన్ స్టాండ్స్‌లోనే కన్నీళ్లపర్యంతమైంది.

ఆ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.ఐపీఎల్ చరిత్రలో ఐదు సార్లు టైటిల్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కు ఈ సీజన్ ఊహించని విధంగా మారింది.

బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పూర్తిగా విఫలమవుతూ వస్తోంది.రుతురాజ్ గైక్వాడ్ ( Ruturaj Gaikwad )గాయం కారణంగా జట్టుకు దూరమవ్వడంతో ఎంఎస్ ధోనీ మళ్లీ కెప్టెన్సీ చేపట్టినా.

జట్టు విజయం బాట పట్టలేదు. """/" / శుక్రవారం (ఏప్రిల్ 25) జరిగిన చెన్నై వర్సెస్ హైదరాబాద్ మ్యాచ్‌కు స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్( Star Heroine Shruti Haasan ) హాజరయ్యింది.

స్టేడియంలో ఆమె తన అభిమాన టీమ్ అయిన సీఎస్కేకు మద్దతు ఇచ్చింది.ధోనీ బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు కూడా ఎంతో సంతోషంగా ఫ్యాన్ గర్ల్ లా వీడియోలు తీసుకుంటూ ఎంజాయ్ చేసింది.

కానీ మ్యాచ్ ఫలితం మాత్రం.చేదు అనుభవం మిగిల్చింది.

5 వికెట్ల తేడాతో చెన్నై ఓటమి పాలవ్వడంతో శ్రుతి హాసన్ స్టాండ్స్‌లోనే కన్నీళ్లు పెట్టుకుంది.

ఇది ఫ్యాన్స్‌ను తీవ్రంగా కదిలించింది.ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

ఇక ఈ మ్యాచ్‌కు తమిళ సినీ స్టార్స్ అజిత్ కుమార్, శివ కార్తికేయన్ కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు.

వారంతా చెన్నై సూపర్ కింగ్స్‌కు మద్దతుగా నిలిచినా చివరికి జట్టు పరాజయం పాలైంది.