ఏపీలో స్టార్ హీరోయిన్ సమంతకు గుడి.. ఆ విగ్రహంలో మార్పులు చేశారుగా!

ఈరోజు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత( Star Heroine Samantha ) పుట్టినరోజు అనే సంగతి తెలిసిందే.

సమంత పుట్టినరోజు ఆమె అభిమానులకు పండగ రోజు అని చెప్పవచ్చు.స్టార్ హీరోయిన్ సమంతకు ఇప్పటికే ఒక గుడి కట్టగా తాజాగా ఆ గుడిలో విగ్రహంలో మార్పు చేశారని సమాచారం అందుతోంది.

ఏపీలోని బాపట్లలో సమంత కోసం ఒక అభిమాని గతంలో గుడి కట్టారు.అప్పట్లో ఆ గుడి ఒకింత సంచలనం అయిన సంగతి తెలిసిందే.

తమిళనాడు రాష్ట్రంలో ( Tamil Nadu )ఇప్పటికే కొంతమంది హీరోయిన్లకు గుడులు ఉన్నాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

అప్పట్లో ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేయగా ఇప్పుడు ఆ విగ్రహానికి బదులుగా గోల్డెన్ కలర్ సమంత విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

ఈరోజు సమంత పుట్టినరోజు కావడంతో అభిమానులు కేక్ కట్ చేశారు.ఈ అభిమాని పలువురు అనాథ పిల్లలకు భోజనాలను ఏర్పాటు చేశారు.

సమంత చేసిన ఛారిటీ వర్క్స్ నచ్చడం వల్లే గుడి కట్టానని ఆ అభిమాని పేర్కొన్నారు.

నాగచైతన్యతో విడాకులు, మయోసైటిస్ వ్యాధి(Myositis Disease ) బారిన పడిన దగ్గర సినిమాలను పూర్తిగా సినిమాలు చేయడం మానేసింది.

ఆమె నిర్మించిన శుభం సినిమాలో సమంత చిన్న పాత్రలో మెరిశారు.సిటాడెల్ వెబ్ సిరీస్ తో సమంత ప్రేక్షకుల ముందుకు రాగా ఆ వెబ్ సిరీస్ ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు.

"""/" / హీరోయిన్ సమంత కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉంటాయో చూడాల్సి ఉంది.

సమంత నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.సమంత పారితోషికం 5 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని తెలుస్తోంది.

సమంత రాబోయే రోజుల్లో మరిన్ని సంచలనాలను సృష్టిస్తారేమో చూడాల్సి ఉంది.స్టార్ హీరోయిన్ సమంత ఇతర భాషల్లో సైతం మరింత సక్సెస్ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు.