Sai Pallavi : స్టార్ హీరోయినైనా సాయి పల్లవి ఆ విషయంలో ఇప్పటికీ తండ్రి మాటే వింటుందా..?

లేడి పవర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న సాయి పల్లవి ( Sai Pallavi ) ఇప్పటికి కూడా ఆ విషయంలో తన తండ్రి మాట వింటుందట.

మరి ఇంతకీ సాయి పల్లవి ఇంత పెద్ద హీరోయిన్ అయినా కూడా ఎందుకు ఇప్పటికీ తన తండ్రి మాటను ఫాలో అవుతోంది.

ఇంతకీ తన తండ్రి చెప్పిన ఆ మాట ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

సాయి పల్లవి మలయాళ ప్రేమమ్ ( Premam ) సినిమాలో ఒక హీరోయిన్ గా చేసింది.

ఇక ఈ సినిమా తెలుగులో కూడా విడుదలైంది.ఇక మొదటిసారి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా చేసిన ఫిదా సినిమాలో పల్లెటూరు అమ్మాయి భానుమతిగా నటించి మెప్పించింది.

ఇక ఈ సినిమాలో వరుణ్ తేజ్ ని డామినేట్ చేసిందని చెప్పవచ్చు.ఇక మొదటి సినిమాలో సాయి పల్లవి నటన చూసిన చాలా మంది దర్శక నిర్మాతలు ఆమెకు వరుసగా అవకాశాలు ఇచ్చారు.

"""/" / అలా ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాల్లో నటించింది.అయితే గత కొద్ది రోజులుగా సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న సాయి పల్లవి గురించి ఎన్నో వార్తలు చక్కర్లు కొట్టాయి.

ఆమె ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పి ఆమెకు ఇష్టమైన డాక్టర్ వృత్తి లో స్థిరపడబోతుంది అంటూ వార్తలు వినిపించాయి.

కానీ అనూహ్యంగా నాగచైతన్యతో ఒక సినిమా అలాగే శివ కార్తికేయన్ (Siva Karthikeyan) తో మరో సినిమా ప్రకటించి నేను సినిమా ఇండస్ట్రీలోనే కొనసాగుతున్నాను అంటూ హింట్ ఇచ్చింది.

"""/" / ఇదిలా ఉంటే అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి పల్లవి నేను ఎప్పుడైనా సరే నా తండ్రి చెప్పిన విషయాన్ని మర్చిపోను.

ఆయన చెప్పిందే ఫాలో అవుతాను అంటూ మాట్లాడింది.ఇక ఆ విషయం ఏమిటంటే.

సాయి పల్లవి ( Sai Pallavi ) ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.

అసలు నేను సినిమాల్లోకి రావాలని అనుకోలేదు.నాకు నటనపై పెద్దగా ఇంట్రెస్ట్ కూడా లేదు.

కానీ అనుకోకుండా నాకు ప్రేమమ్ మూవీలో అవకాశం వచ్చింది.ఆ ఛాన్స్ వచ్చినప్పుడు మా ఫ్యామిలీ కూడా షాక్ అయ్యారు.

ఇక ఆ సినిమాలో ఛాన్స్ వచ్చినప్పుడు మా నాన్న ఒకటే చెప్పారు.జీవితం నిన్ను ఏ వైపుకు నడిపిస్తే ఆ వైపు నడువు.

కానీ ఎక్కడికి వెళ్ళినా సరే గౌరవంగా బతకడం, గౌరవంగా ఉండడం అనేది మెయిన్ ఇంపార్టెంట్.

ఏ విషయంలోనైనా గౌరవంగానే ఉండాలి అంటూ మా నాన్న చెప్పిన మాటలు నేను ఎప్పటికీ మర్చిపోను.

ఆయన చెప్పిన ఈ విషయాన్ని నేను ఎప్పుడూ ఫాలో అవుతూ ఉంటాను అంటూ సాయి పల్లవి చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం సాయి పల్లవి నాగచైతన్య హీరోగా వస్తున్న తండేల్ మూవీ ( Thandel Movie) లో హీరోయిన్ గా చేస్తుంది.

టాలీవుడ్ ఇండస్ట్రీని టార్గెట్ చేస్తున్న ఐటీ.. తెర వెనుక ఇంత జరిగిందా?