స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే డ్రెస్ ఖరీదు తెలిస్తే షాకవ్వాల్సిందే?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన పూజా హెగ్డే హవా ఈ మధ్య కాలంలో తగ్గినా ఆమె చేతిలో చెప్పుకోదగ్గ స్థాయిలో సినిమా ఆఫర్లు ఉన్నాయనే సంగతి తెలిసిందే.

తాజాగా వైట్ డ్రెస్ లో దిగిన ఫోటోలను పూజా హెగ్డే సోషల్ మీడియాలో షేర్ చేయగా ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఈ ఫోటోలలో పూజా హెగ్డే మరింత అందంగా కనిపిస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.కాన్స్ చిత్రోత్సవంలో పూజా హెగ్డే అదరగొడుతున్నారు.

ఫోటోషూట్లలో పాల్గొంటూ పూజా హెగ్డే ఫోటోలు దిగి ఆ ఫోటోలను అభిమానులతో పంచుకుంటున్నారు.

పూజాహెగ్డే ధరించిన ఈ వైట్ డ్రెస్ ఖరీదు 1,15,000 రూపాయలు అని సమాచారం.

పర్ఫెక్ట్ డిజైన్ తో తయారైన ఈ డ్రెస్ ను ధరిస్తే అదనంగా జ్యూవెలరీని ధరించాల్సిన అవసరం అయితే ఉండదని చెప్పవచ్చు.

ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా ఈ డ్రెస్ లో చూడటానికి అందంగా కనిపించడం సాధ్యమవుతుంది.

సాగరతీరంలో దేవకన్యలా పూజా హెగ్డే ఉన్నారని కొంతమంది నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఈ మధ్య కాలంలో తెలుగులో పూజా హెగ్డే నటించిన సినిమాలేవీ ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.

అయినప్పటికీ పూజా హెగ్డేకు ప్రేక్షకులలో క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.తెలుగులో మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీలో, పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబో మూవీలో ఈ నటి నటిస్తుండటం గమనార్హం.

"""/" / ఈ సినిమాలతో పాటు సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో కూడా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారనే సంగతి తెలిసిందే.

ఈ సినిమాల ఫలితాలపైనే పూజా హెగ్డే కెరీర్ ఆధారపడి ఉందని చెప్పవచ్చు.హీరోయిన్ పూజా హెగ్డే ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు సక్సెస్ సాధిస్తే మాత్రమే ఆమెకు కొత్త సినిమా ఆఫర్లు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి.

Chiranjeevi : చిరంజీవిని నా తమ్ముడిగా అస్సలు ఊహించుకోలేను.. ప్రముఖ నటి షాకింగ్ కామెంట్స్ వైరల్!