ఆ యాడ్ కోసం నయనతార రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే!
TeluguStop.com
స్టార్ హీరోయిన్ నయనతార ( Star Heroine Nayanthara )రెమ్యునరేషన్ కు సంబంధించిన విషయాల ద్వారా తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు.
సౌత్ ఇండియాలో హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే నటీమణులలో నయనతార ఒకరు కావడం గమనార్హం.
ఈమెకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.గత 20 ఏళ్లలో ఎంతోమంది నటీమణులు సౌత్ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది.
అయితే వీళ్లలో కొందరికి మాత్రమే ఇప్పటికీ క్రేజ్ ఉంది.అలా క్రేజ్ ఉన్న హీరోయిన్లలో నయనతార ఒకరు కాగా కెరీర్ తొలినాళ్లలో ఈ బ్యూటీకి కొన్ని ఇబ్బందులు ఎదురైనా తర్వాత రోజుల్లో వరుస విజయాలతో సత్తా చాటారు.
పలువురు సెలబ్రిటీలతో ప్రేమలో ఉండటం ద్వారా వార్తల్లో నిలిచిన నయనతార నిర్మాతగా వ్యాపారవేత్తగా కూడా సత్తా చాటారు.
ప్రస్తుతం ఈ నటి సాధారణంగా తీసుకునే రెమ్యునరేషన్ 10 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
"""/" /
నయనతార ప్రస్తుతం ఒక యాడ్ కోసం 5 కోట్ల రూపాయల రేంజ్( 5 Crores Range For An Ad ) లో పారితోషికం అందుకుంటున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
ఈ యాడ్ నిడివి కేవలం 50 సెకన్లు మాత్రమేనని తెలుస్తోంది.ప్రముఖ డిష్ డీటీహెచ్ సంస్థ ( DTH Company )కోసం నయన్ ఈ రెమ్యునరేషన్ అందుకున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
నయనతార కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉన్నాయో తెలియాల్సి ఉంది. """/" /
వయస్సు పెరుగుతున్నా లుక్స్ పరంగా అదరగొడుతున్న నయన్ తన క్రేజ్ ను అంతకంతకూ పెంచుకుంటున్నారు.
టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా నయనతారకు ఎక్కువ సంఖ్యలో ఆఫర్లు వస్తున్నాయని తెలుస్తోంది.నయనతార క్రేజ్ పరంగా ఒకింత టాప్ లో ఉన్నారనే సంగతి తెలిసిందే.
నయనతార కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తుండటం గమనార్హం.నయనతార తర్వాత ప్రాజెక్ట్ లతో సైతం భారీ విజయాలను సొంతం చేసుకోవాలని అభిమానులు భావిస్తుండటం గమనార్హం.
న్యాచురల్ స్టార్ నాని సినిమా చేతులు మారిందా.. ఆ నిర్మాత ఎంట్రీ ఇవ్వనున్నారా?