ఇతర హీరోల ఈవెంట్స్ కు వెళ్లి వారినే డామినేట్ చేసిన స్టార్స్ వీరే!

మన తెలుగు ప్రేక్షకులకు సినిమాలు అంటే చెప్పలేనంత ఇష్టం.కొత్త సినిమాలు వస్తున్నాయి అంటే ఆ ఉత్సాహమే వేరు.

ఇక తమ అభిమాన హీరో సినిమా అంటే చెప్పాల్సిన పని కూడా లేదు.

ఒక్కసారి ఏ హీరోకు అయినా ఫ్యాన్ అయినారంటే ఇక వారిని ఎంతగా అభిమానిస్తారో స్పెషల్ గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.

అభిమాన హీరో కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు.మరి మన టాలీవుడ్ లో ఇలాంటి క్రేజ్ ఉన్న హీరోలు చాలా మంది ఉంటారు.

ఈ హీరోలు సినిమాల్లోనే కాదు బయట కనిపించిన అభిమానులు అస్సలు వదలరు.వారి అభిమాన హీరోలు బయట ఎక్కడైనా ఈవెంట్స్ లో మాట్లాడే మూమెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు.

వారి స్పీచ్ కోసం ఈగర్ గా వైట్ చేస్తూ ఉంటారు.ఈ స్టార్ హీరోలు తమ సినిమాల ఈవెంట్స్ లో మాత్రమే కాకుండా అప్పుడప్పుడు వేరే హీరోల ఈవెంట్స్ లో గెస్ట్ లాగా హాజరవుతూ ఉంటారు.

అప్పుడు అసలు హీరోను వదిలేసి తమ అభిమాన హీరో స్పీచ్ డామినేట్ అయినా సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి.

మరి మన తెలుగు ఇండస్ట్రీలో ఈవెంట్ ఒకరిది అయితే గెస్ట్ గా వచ్చిన స్టార్ డామినేట్ చేసిన సందర్భాలు ఆ సినిమా ఈవెంట్స్ ఏంటో తెలుసుకుందాం.

H3 Class=subheader-styleచిరంజీవి :/h3p మెగాస్టార్ చిరంజీవి చాలా ఈవెంట్స్ కు గెస్ట్ గా హాజరయ్యారు.

ఈయన స్టేజ్ మీద ఇచ్చే స్పీచ్ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు.

చిరు హాజరైన అన్ని ఈవెంట్ లలో కంటే రంగస్థలం, సరిలేరు నీకెవ్వరూ, ఓ పిట్ట కథ వంటి ఈవెంట్స్ లో ఈయన ఇచ్చిన స్పీచ్ వైరల్ అయ్యింది.

అలాగే ఆ హీరోల కంటే కూడా చిరు ఇచ్చిన స్పీచ్ డామినేట్ అయ్యిందనే చెప్పాలి.

"""/"/ H3 Class=subheader-styleపవన్ కళ్యాణ్:/h3p ఇక మన తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూసే స్పీచ్ లలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పీచ్ ఒకటి.

ఈయన ఇచ్చే స్పీచ్ లు చాలా మటుకు వైరల్ అవుతూనే ఉంటాయి.ఇక ఇతర హీరోల ఈవెంట్స్ లో పవర్ స్టార్ డామినేట్ చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి.

వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది.అంటే సుందరానికి ప్రీ రిలీజ్ ఈవెంట్, రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉన్నాయి.

ఈ ఈవెంట్ లలో పవన్ తన స్పీచ్ తో ఎదుటి వారిని డామినేట్ చేసాడు.

"""/"/ H3 Class=subheader-styleజూనియర్ ఎన్టీఆర్:/h3p ఇక మన ఇండస్ట్రీలో స్పీచ్ ఇచ్చారంటే అలా వింటూనే ఉండాలి అనిపించే వ్యక్తులలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు.

ఈయన స్పీచ్ లు వింటూనే ఉండిపోవచ్చు.అంత బాగా తారక్ తన స్పీచ్ తో డామినేట్ చేస్తారు.

ఎన్టీఆర్ హాజరయిన ఈవెంట్స్ లో ఇటీవల జరిగిన బింబిసార మాత్రమే కాదు.భరత్ అనే నేను ఈవెంట్ లో కూడా ఈయన చేసిన స్పీచ్ ఆకట్టుకుని మహేష్ ను డామినేట్ చేసాడు.

"""/"/ H3 Class=subheader-styleబాలకృష్ణ :/h3p నందమూరి బాలకృష్ణ స్పీచ్ లు కూడా ఫేమస్ అనే చెప్పాలి.

ఈయన ఎన్టీఆర్ అరవింద సామెత వీర రాఘవ సక్సెస్ మీట్ లో ఇచ్చిన స్పీచ్ బాగా ఫేమస్ అయ్యి ఎన్టీఆర్ ను సైతం డామినేట్ చేసింది.

"""/"/ H3 Class=subheader-styleమహేష్ బాబు :/h3p సూపర్ స్టార్ మహేష్ బాబు తక్కువ మాట్లాడిన ఈయన స్పీచ్ ఎదుటి వారితో పోల్చితే డామినేట్ గా ఉంటుంది.

ఈయన గెస్ట్ గా వచ్చి ఇతర హీరోలను డామినేట్ చేసిన సందర్భాలు ఉన్నాయి.

అఖిల్ ఆడియో లాంచ్ లో మహేష్ ఇచ్చిన స్పీచ్ ఆ ఈవెంట్ కే హైలెట్ అయ్యింది.

"""/"/ H3 Class=subheader-styleఅల్లు అర్జున్ :/h3p ఇక అల్లు అర్జున్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు.

ఈయన స్పీచ్ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తుంటారు.అల్లు అర్జున్ ఖైదీ నెం 150 ఈవెంట్ లో ఇచ్చిన స్పీచ్ చిరుని సైతం డామినేట్ చేసింది.

"""/"/ H3 Class=subheader-styleవిజయ్ దేవరకొండ :/h3p టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ క్రేజ్ ఇప్పుడు ఎవ్వరికి లేదు.

ఈయన క్రేజ్ దృష్ట్యా ఈయన ఎక్కడ మాట్లాడిన అది కాస్త వైరల్ అవుతుంది.

విజయ్ తన ఈవెంట్స్ లోనే కాదు బయట హీరోల ఈవెంట్స్ లో చేసిన వ్యాఖ్యలు సంచనలం రేపుతాయి.

ఈయన తమ్ముడు నటించిన దొరసాని ఈవెంట్ లో విజయ్ స్పీచ్ ఆనంద్ దేవరకొండ ను డామినేట్ చేసింది.

వీరు మాత్రమే కాదు చిరు ఈవెంట్స్ లో నాగబాబు స్పీచ్, పవన్ కళ్యాణ్ ఈవెంట్ లో బండ్ల గణేష్ స్పీచ్ ల కోసం ఆడియెన్స్ ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉంటారు.