గౌతమ్ తిన్ననూరి కోసం వెయిట్ చేస్తున్న స్టార్ హీరోలు…
TeluguStop.com
ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరు చేయనటువంటి కొత్త స్టోరీ తో సినిమాలు చేయడానికి దర్శకులు చాలామంది ఉన్నప్పటికి గౌతమ్ తిన్ననూరి(Gautham Tinnanuri) లాంటి దర్శకుడు విజయ్ దేవరకొండతో(Vijay Deverakonda , KINGDOM) చేస్తున్న కింగ్ డమ్ సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి.
మరి ఈ వార్తలకు తగ్గట్టుగానే ఈ సినిమా ఉంటుందా? యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని మెప్పించే విధంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.
"""/" /
నిజానికి ఈ సినిమాని రామ్ చరణ్ (Ram Charan)తో చేయాలనుకున్నాడు.
కానీ ఆయన ఈ కథను రిజెక్ట్ చేయడంతో ఈ ప్రాజెక్టుని విజయ్ దేవరకొండతో చేస్తున్నాడు.
గౌతమ్ తిన్ననూరి ( Gautham Tinnanuri )మొదటి నుంచి కూడా ఒక సెన్సిబుల్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.
హిందీ లో జెర్సీ సినిమా ప్లాప్ అవ్వడం వల్లే రామ్ చరణ్ చిరంజీవి (Ram Charan, Chiranjeevi)ఈ సినిమాని రిజెక్ట్ చేసినట్టుగా తెలుస్తోంది.
కానీ ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ అందరినీ ఆకట్టుకోవడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేయడానికి ఒక సినిమా రాబోతుందనే హింట్ అయితే ఇచ్చింది.
"""/" /
మరి గౌతమ్ తిన్ననూరి లాంటి దర్శకుడు ఇలాంటి సినిమాలు చేస్తున్నాడు అని ప్రతి ఒక్కరు ఆశ్చర్యపడేలా ఈ సినిమా టీజర్ ఉండడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి.
ఇక ఇప్పటివరకు చాలామంది దర్శకులు వాళ్ళని వాళ్ళు స్టార్ డైరెక్టర్ గా ఎలివేట్ చేసుకుంటున్న సందర్భంలో గౌతమ్ తిన్ననూరి కూడా తొందరలోనే స్టార్ డైరెక్టర్ గా మారబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
ఇక ఇప్పటికే ఈయన డైరెక్షన్ లో నటించడానికి మరికొంతమంది హీరోలు సైతం సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఇక కింగ్ డమ్ సినిమా భారీ విజయాన్ని సాధిస్తే ఆయన జూనియర్ ఎన్టీఆర్ తో కూడా సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి అంటూ కొన్ని వార్తలైతే బయటకు వస్తున్నాయి.