స్పీడ్‌ పెంచిన సినిమాలు.. సమ్మర్‌ కోసం క్యూ

టాలీవుడ్‌ స్టార్‌ హీరోల సినిమాలు కరోనా కారణంగా ఈ ఏడాది సమ్మర్‌ కు వాయిదా పడ్డ విషయం తెల్సిందే.

కొన్ని సినిమాలను సమ్మర్‌ కు కూడా విడుదల చేయడం అనుమానమే అన్నట్లుగా ప్రచారం జరిగింది.

కరోనా కారణంగా థియేటర్లు మొన్నటి వరకు మూత పడి ఉన్నాయి.ఇటీవలే 50 శాతం ఆక్యుపెన్సీతో ఓపెన్‌ చేసుకోవచ్చు అంటూ అధికారికంగా అనుమతులు వచ్చాయి.

50 శాతం ఆక్యుపెన్సీతో పెద్ద సినిమాలు విడుదల సాధ్యం కాదని 10 నుండి 20 కోట్ల బడ్జెట్‌ సినిమాలకు కూడా 50 శాతం ఆక్యుపెన్సీ నష్టాలను మిగిల్చే అవకాశం ఉందని అంత కంటే తక్కువ బడ్జెట్‌ సినిమాలను మాత్రమే విడుదల చేసుకుంటూ వస్తున్నారు.

ఒకటి రెండు ధైర్యం చేసి ముందుకు వస్తున్నా ఫలితం అటు ఇటుగా బెడిసి కొడుతున్నాయి.

ఇలాంటి సమయంలో తమిళ నాట 100 శాతం ఆక్యుపెన్సీకి ప్రభుత్వం ఓకే చెప్పింది.

దాంతో తెలుగు రాష్ట్రాల్లో కూడా త్వరలోనే థియేటర్లు 100 శాతం ఆక్యుపెన్సీని దక్కించుకుంటాయి అని అంతా భావిస్తున్నారు.

టాలీవుడ్ సినిమాలను సమ్మర్‌ లో విడుదల చేయాలనుకుంటే అప్పటి వరకు వంద శాతం ఆక్యుపెన్సీ కి అనుమతులు వచ్చే అవకాశం ఉంది.

అందుకే మార్చి నుండి వరుసగా సినిమాలు విడుదల అయ్యే అవకాశం ఉంది.తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే కరోనా కేసులు చాలా చాలా తగ్గాయి.

కరోనా వేరియంట్‌ అంటూ ఆందోళన కలిగించే ప్రచారం జరిగినా దాని వల్ల పెద్దగా కేసులు పెరగలేదు.

దాంతో సమ్మర్‌ లో ఖచ్చితంగా థియేటర్లకు పూర్తిగా గేట్లు ఎత్తే అవకాశం ఉందంటున్నారు.

ఇలాంటి సమయంలో టాలీవుడ్‌ బడా నిర్మాతలు తమ సినిమాలను విడుదల చేసేందుకు హడావుడిగా ఉన్నారు.

ఇప్పటి నుండే ఏర్పాట్లు చేస్తున్నారు.ముందస్తుగా థియేటర్ల విషయం తెలిసిన వారు తమ సినిమాల విడుదల తేదీలను ప్రకటిస్తున్నారు.

గత ఏడాదిలో వాయిదా పడ్డ సినిమాలన్ని కూడా ఈ ఏడాది సమ్మర్‌ లో క్యూ కట్టబోతున్నట్లుగా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

30 రోజుల్లో ప్రేమించడం ఎలా, ఉప్పెన సినిమాలను మొదలుకుని వకీల్‌ సాబ్‌ వరకు ఎన్నో సినిమాలు విడుదల కాబోతున్నాయి.

విపక్ష కూటమిపై పేర్ని నాని విమర్శలు