మహేష్ బాబు తో పోటీ కి రెఢీ అంటున్న స్టార్ హీరో…

వెంకటేష్ హీరోగా శైలేష్ కొలన్ దర్శకత్వంలో వస్తున్న సైంధవ్( Saindhav ) సినిమాకి సంబంధించిన టీజర్ ఇవాళ్ళ రిలీజ్ చేయడం జరిగింది.

ఈ సినిమాకు సంబంధించిన టీజర్ అద్భుతంగా ఉంది.ఇక ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13వ తేదీన రిలీజ్ అవుతుందని చిత్ర యూనిట్ తెలపడం జరిగింది.

ఇక ఈ క్రమంలోనే సంక్రాంతికి మహేష్ బాబు( Mahesh Babu ) హీరో త్రివిక్రమ్ డైరెక్షన్ లో వస్తున్న గుంటూరు కారం సినిమా రిలీజ్ అవుతున్న విషయం మనకు తెలిసిందే.

అయితే మరో పక్క పవన్ కళ్యాణ్ కూడ ఓజీ సినిమాతో రాబోతున్నాడు.ఇక ఇలాంటి క్రమంలో వెంకటేష్ తన సినిమాని రిలీజ్ చేయడం కరెక్టేనా అనేది ఇక్కడ చర్చనీయాంశం గా మారింది.

ఎందుకంటే మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలు వచ్చిన తర్వాత వెంకటేష్ సినిమాని పండుగ సీజన్ లో పట్టించుకునేవారు ఎవరు ఉండరు అనేది ట్రేడ్ పండితులు సైతం చెప్తున్న మాట.

"""/" / ఇక ఇలాంటి క్రమంలో వెంకటేష్ కొంచెం తగ్గి రిపబ్లిక్ డే కి ఈ సినిమాని రిలీజ్ చేసుకుంటే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు.

కానీ పండుగ సీజన్ ని క్యాష్ చేసుకోవడానికి సైంధవ్ సినిమా ప్రొడ్యూసర్లు కూడా ఆసక్తిగా చుపించడం ఇక దానికి తోడు ఈ సినిమా కంటెంట్ కూడా చాలా అద్భుతంగా ఉండడంతో వాళ్ళు కూడా వెనక్కి తగ్గడం లేదు అనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది.

"""/" / ఇక ఈ క్రమంలో వెంకటేష్( Venkatesh ) లాంటి సీనియర్ హీరో సినిమాకి సూపర్ హిట్ టాక్ వస్తే తప్ప వసూలు అంత బాగా కలెక్ట్ చేయదు.

ఇక ఈ క్రమంలో మహేష్ బాబు ని, పవన్ కళ్యాణ్ ని ఎదిరించి వెంకటేష్ హిట్టు కొట్టగలడా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న గా మారుతుంది.

నిజానికి వెంకటేష్ సోలోగా వస్తే ఆయనకి మంచి కలెక్షన్లు వస్తాయి.కానీ పండగను క్యాష్ చేసుకోవడానికి రావడంతో ఈ మూడు సినిమాలకి ఎన్ని థియేటర్లు దొరుకుతాయనేది ఇంకా కన్ఫామ్ గా తెలియదు.

అయితే ఇప్పుడు వచ్చే సంక్రాంతికి సంక్రాంతి విన్నర్ ఎవరో అవుతారో చూడాలి.

దేవర సీక్వెల్ లో దేవర ఉంటాడా.. ఈ ప్రశ్నకు జూనియర్ ఎన్టీఆర్ జవాబిదే!