ఆ నటుడి టిఫిన్ బాక్సులో చపాతీలను దొంగలించిన సుశాంత్!

బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి చెంది నాలుగు నెలలు పూర్తైంది.

ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యులు కొన్ని రోజుల క్రితమే సుశాంత్ ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్టు ధృవీకరించారు.

సీబీఐ దర్యాప్తు కూడా కొలిక్కివచ్చినట్టు తెలుస్తోంది.సుశాంత్ మృతి తర్వాత దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కు సంబంధించిన కేసు మాత్రం అనేక మలుపులు తిరుగుతోంది.

డ్రగ్స్ కేసులో ఎన్సీబీ అధికారులు మరి కొందరిని అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సుశాంత్ కొన్నేళ్ల క్రితం పలు సీరియళ్లలో కూడా నటించిన విషయం తెలిసిందే.సుశాంత్ తో పాటు ఒక సీరియల్ లో నటించిన నటుడు జై థక్కర్ షూటింగ్ సమయంలో జరిగిన సంఘటలను గుర్తు చేసుకుని ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

జై థక్కర్ సుశాంత్ తన చపాతీలను దొంగలించేవాడంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.తాను పవిత్ర రిష్తా సీరియల్ లో సుశాంత్ కు చిన్న సోదరుడిగా నటించానని.

సుశాంత్ తల్లి చిన్నతనంలో మరణించడం వల్ల సుశాంత్ అలా చేశాడని చెప్పారు.తనకు అమ్మ చేసి ఇచ్చిన చపాతీ ప్రతిరోజూ టిఫిన్ బాక్స్ నుంచి మాయమయ్యేదని.

చపాతీ ఎవరు తినే వాళ్లో తనకు తెలిసేది కాదని అన్నారు.అమ్మకు ఈ విషయం తెలిసి షూటింగ్ లో పాల్గొన్న కొందరిని జై థక్కర్ లంచ్ బాక్స్ లోని చపాతీలను ఎవరైనా తింటున్నారా.

? అని ప్రశ్నించగా సుశాంత్ తాను చపాతిలను తిన్నానని సమధానం ఇచ్చాడని చెప్పారు.

చపాతీలను తింటే తన తల్లి గుర్తుకు వచ్చేదని అందుకే ఆ విధంగా చేశానని సుశాంత్ జై థక్కర్ తల్లికి చెప్పారు.

ఆ తరువాత తన తల్లి సుశాంత్ కోసం కూడా చపాతీలను పంపించేదని జై థక్కర్ చెప్పుకొచ్చారు.

సుశాంత్ అన్నయ్య మృతి తాను ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని.సుశాంత్ మన మధ్య లేకపోవడం బాధాకరమని జై థక్కర్ తెలిపారు.

పవిత్ర రిష్తా సీరియల్ సమయంలో సుశాంత్ తో కలిసి దిగిన ఫోటోలను జై థక్కర్ షేర్ చేశారు.

అల్లు అర్జున్ బ్యాక్ టు బ్యాక్ ఇండస్ట్రీ హిట్లు కొట్టబోతున్నారా..?