ఆ దేవతను నేను నమ్ముతానన్న రిషబ్.. వాళ్లను దేవత ఆవహించిందంటూ?
TeluguStop.com
కాంతార మూవీ సక్సెస్ తో రిషబ్ శెట్టికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఊహించని స్థాయిలో పెరిగింది.
కాంతార తరహా సినిమాలలో నటించి మెప్పించడం సులువు కాదని చాలామంది భావిస్తారు.రిషబ్ శెట్టి మాట్లాడుతూ కాంతార సినిమాకు సంబంధించి షాకింగ్ విషయాలను వెల్లడించారు.
కాంతార మూవీ సక్సెస్ మాటల్లో వర్ణించలేని అనుభూతి అని రిషబ్ శెట్టి తెలిపారు.
నేను పంజుర్లీ దేవతను నమ్ముతానని రిషబ్ శెట్టి కామెంట్లు చేశారు.ప్రతిరోజూ పూజ చేసిన తర్వాత కాంతార సినిమాకు సంబంధించిన సీన్లను షూట్ చేసేవాడినని ఆయన పేర్కొన్నారు.
మా ప్రాంతంలో ఉన్న ఈ ఆచారాన్ని బాల్యం నుంచి చూస్తున్నానని రిషబ్ శెట్టి చెప్పుకొచ్చారు.
అందుకు సంబంధించిన వీడియోలతో పాటు నా అనుభవాలను కూడా రాసిపెట్టుకున్నానని రిషబ్ శెట్టి కామెంట్లు చేశారు.
దేవత ఆవహించిన వ్యక్తులను సైతం నేను నా కళ్లతో చూశానని ఆయన అన్నారు.
"""/"/
ఈ అనుభవాల ద్వారా కాంతార మూవీ క్లైమాక్స్ ఏ విధంగా ఉండాలో నేను రాసి పెట్టుకున్నానని రిషబ్ చెప్పుకొచ్చారు.
మనసులోనే విజువల్స్ ను సిద్ధం చేసుకుని కాంతార మూవీ క్లైమాక్స్ ను తెరకెక్కించానని ఆయన తెలిపారు.
కాంతార మూవీ క్లైమాక్స్ గురించి నా మనసులో ఉన్న ఆలోచనలను ముందుగానే డీఓపీకి చెప్పానని రిషబ్ శెట్టి వెల్లడించారు.
కాంతార మూవీ క్లైమాక్స్ గురించి చిత్రయూనిట్ కు కూడా తెలియదని రిషబ్ శెట్టి పేర్కొన్నారు.
సినిమాలో ఉన్న ఓ అనే శబ్దం గురించి రిషబ్ శెట్టి చెబుతూ ఆ శబ్దం నేను అరిచిన శబ్దమేనని అన్నారు.
డబ్బింగ్ సమయంలో కూడా నేను అరిచిన ఆ శబ్దాన్ని మార్చలేదని ఆయన కామెంట్లు చేశారు.
ఆ తర్వాత ఓ అనే శబ్దంతో మళ్లీ షూట్ చేయాలని భావించామని రిషబ్ శెట్టి అన్నారు.
రిషబ్ శెట్టి వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
వైరల్: 20 సంచుల నిండా నాణేలతో కోర్టుకెళ్లిన వ్యక్తి… అందరూ షాక్!