రవితేజ కొత్త మూవీ రెమ్యునరేషన్ అన్ని కోట్లా..?
TeluguStop.com

టాలీవుడ్ స్టార్ హీరోలు ఈ మధ్య కాలంలో ఒక సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయితే రెమ్యునరేషన్ ను అమాంతం పెంచేస్తున్నారు.


నాన్ థియేట్రికల్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడవుతున్న నేపథ్యంలో స్టార్ హీరోలు రెమ్యునరేషన్ ను తగ్గించుకోవడానికి ఏ మాత్రం ఇష్టపడటం లేదు.


కరోనా వల్ల ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా రెమ్యునరేషన్ ను తగ్గించుకుంటే మార్కెట్ పై ప్రభావం పడుతుందని భావిస్తున్నారు.
క్రాక్ సినిమాతో సక్సెస్ ను సొంతం రవితేజ శరత్ మాండవ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా కోసం కెరీర్ లోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకోనున్నారని సమాచారం.
కొన్నేళ్ల క్రితం నుంచి వరుస డిజాస్టర్లతో ఇబ్బంది పడుతున్న రవితేజ క్రాక్ సినిమాకు రెమ్యునరేషన్ కాకుండా ఒక ఏరియా హక్కులను తీసుకున్నారు.
గోపీచంద్ మలినేని రవితేజ కాంబినేషన్ లో మూడు సినిమాలు తెరకెక్కగా మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి.
"""/"/
క్రాక్ సినిమా ఏకంగా 60 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధించింది.
అనేక ఆవాంతరాలను దాటుకుని రిలీజైన క్రాక్ 50 శాతం ఆక్యుపెన్సీతో విడుదలై క్రాక్ ఈ రికార్డును సొంతం చేసుకుంది.
శరత్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా కొరకు రవితేజ ఏకంగా 15 కోట్ల రూపాయల పారితోషికం అందుకుంటున్నారని సమాచారం.
ఈ సినిమాలో రవితేజ చిత్తూరు జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉద్యోగిగా కనిపించనున్నారని సమాచారం.
"""/"/
ఈ సినిమాతో రవితేజ కొత్త కథలను కూడా వింటున్నారని తెలుస్తోంది.ఆ సినిమాలకు రవితేజ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారో తెలియాల్సి ఉంది.
క్రాక్ సక్సెస్ ను రవితేజ బాగానే క్యాష్ చేసుకుంటూ ఉండటం గమనార్హం.మరోవైపు రవితేజ ప్రస్తుతం నటిస్తున్న ఖిలాడీ మూవీ కొత్త రిలీజ్ డేట్ తెలియాల్సి ఉంది.
మే 28వ తేదీన ఖిలాడీ రిలీజ్ కావాల్సి ఉండగా కరోనా సెకండ్ వేవ్ వల్ల ఈ సినిమా షూటింగ్ ఆలస్యమైంది.
పహల్గాం బాధితుడి ఇంటికి అనన్య నగళ్ల.. ఈ నటి నిర్ణయాన్ని ఎంత మెచ్చుకున్నా తక్కువే!