గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కు మరో అరుదైన గౌరవం.. క్లీంకార పుట్టాక దశ తిరుగుతోందిగా!

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్( Ram Charan ) గత సినిమా విడుదలై దాదాపుగా రెండున్నర సంవత్సరాలు అవుతోంది.

ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ ఏడాదే గేమ్ ఛేంజర్( Game Changer ) విడుదలవుతుందని చెబుతున్నా అభిమానులు మాత్రం ఈ సినిమా రిలీజ్ విషయంలో టెన్షన్ పడుతున్నారు.

అయితే రామ్ చరణ్ ఈ మధ్యకాలంలో అరుదైన ఘనతలను సొంతం చేసుకోవడం ద్వారా తరచూ వార్తల్లో నిలుస్తున్నారు.

క్లీంకార( Klin Kaara ) పుట్టిన తర్వాత రామ్ చరణ్ కు కెరీర్ పరంగా ఊహించని స్థాయిలో కలిసొస్తోందని ఫ్యాన్స్ చెబుతున్నారు.

తాజాగా రామ్ చరణ్ కు మరో అరుదైన గౌరవం దక్కడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.

స్టార్ హీరో రామ్ చరణ్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్( Indian Film Festival Of Melbourne ) వేడుకకు ముఖ్యఅతిథిగా హాజరు కావడం జరిగింది.

అక్కడ రామ్ చరణ్ ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ అంబాసిడర్ పురస్కారాన్ని అందుకోనున్నారని తెలుస్తోంది.

"""/" / మరోవైపు మెల్బోర్న్ ఫెడరేషన్ స్క్వేర్ లో భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరగనుండగా అక్కడ రామ్ చరణ్ మన దేశ జెండాను ఆవిష్కరించనున్నారు.

ఇలాంటి గౌరవం అతికొద్ది మందికి మాత్రమే దక్కుతుందని ఈ విషయంలో రామ్ చరణ్ నిజంగా అదృష్టవంతుడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ పరంగా అంతకంతకూ ఎదుగుతుండటంపై ఫ్యాన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

మరోవైపు రామ్ చరణ్ యాక్టింగ్ స్కిల్స్ పై ప్రముఖ ఫ్రెంచ్ హీరో ప్రశంసల వర్షం కురిపించడం గమనార్హం.

"""/" / ఫ్రెంచ్ హీరో లూకాస్ బ్రావో( Lucas Bravo ) ఆర్ఆర్ఆర్( RRR ) మూవీ హీరో రామ్ చరణ్ నటన అద్భుతమని చెప్పుకొచ్చారు.

ఆర్ఆర్ఆర్ మూవీ ఇంట్రడక్షన్ సీన్, ఎమోషనల్ సీన్ లలో చరణ్ బాగా నటించారని యాక్షన్ సీన్స్ లో సైతం చరణ్ ఆకట్టుకున్నారని లూకాస్ బ్రావో అభిప్రాయపడ్డారు.

ఆర్ఆర్ఆర్ విడుదలై సంవత్సరాలు గడుస్తున్నా ఈ సినిమా తరచూ ఏదో ఒక విధంగా వార్తల్లో నిలుస్తుండటం గమనార్హం.

ప్రభాస్‌కు ఆ సినిమా సెకండాఫ్ అస్సలు నచ్చలేదు కానీ..?