చిరుత అనే పదానికి కొత్త అర్థం చెప్పిన రామ్ చరణ్.. క్లీంకార ఫోటో చూపిస్తూ?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్( Ram Charan ) ఫస్ట్ మూవీ టైటిల్ చిరుత( Chirutha ) అనే సంగతి తెలిసిందే.

ఈ టైటిల్ ఫిక్స్ అయిన సమయంలో చిరుత అంటే చిరుత పులి అనే అర్థం ఒకటి కాగా చిరు తనయుడు అనే మరో అర్థం వస్తుందని సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ వైరల్ చేశారు.

ఈరోజు చిరంజీవి పుట్టినరోజు కాగా చిరుత అనే పదానికి రామ్ చరణ్ కొత్త అర్థం చెప్పారు.

క్లీంకార( Klinkara ) ఫోటో చూపిస్తూ చరణ్ చెప్పిన అర్థం హాట్ టాపిక్ అవుతోంది.

"""/" / చిరుత అంటే "చిరు తాత" ( Chiru Tata )అని రామ్ చరణ్ చెప్పుకొచ్చారు.

చిరంజీవి క్లీంకారను ఎత్తుకున్న ఫోటోను చరణ్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

క్లీంకార ఫోటోను లైట్ గా కనిపించేలా చూపిస్తూ ఈ ఫోటోను ఫోటోను షేర్ చేశారు.

చిరంజీవి, రామ్ చరణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉండగా ఈ ఇద్దరి కాంబినేషన్ లో మేకర్స్ మరో సినిమాను ప్లాన్ చేస్తున్నారని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.

"""/" / రామ్ చరణ్ క్లీంకారకు సంబంధించి ఫేస్ చూపిస్తూ ఫోటో ఎప్పుడు రివీల్ చేస్తారో చూడాల్సి ఉంది.

మెగా ప్రిన్సెస్( Mega Princess ) కు సంబంధించిన ఫోటో చూడటానికి అభిమానులు ఎంతగానో ఆసక్తి చూపిస్తున్నారు.

చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తుండగా దిల్ రాజు ఈ సినిమాకు నిర్మాత అనే సంగతి తెలిసిందే.

ఈ సినిమా ఆలస్యంగా రిలీజయ్యే అవకాశం ఉండటంతో రిలీజ్ డేట్ కు సంబంధించి స్పష్టత రావడం లేదు.

రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబో మూవీ షూటింగ్ కు సంబంధించి మరికొన్ని రోజుల్లో అప్ డేట్స్ వచ్చే అవకాశం అయితే ఉంది.

ఈ ఏడాదే ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశం అయితే ఉంది.రామ్ చరణ్ శంకర్ కాంబో మూవీ 250 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతుంది.

దిల్ రాజు ఈ సినిమా బడ్జెట్ విషయంలో రాజీ పడటం లేదని తెలుస్తోంది.

ఆ సినిమాతో మహేష్ పని గోవిందా అన్నారు.. కట్ చేస్తే నాలుగు రెట్ల లాభం.. ఏ మూవీ అంటే?