ఆ స్టార్ హీరోతో మల్టీస్టారర్ చేస్తానని రామ్ చరణ్ చెప్పారా.. ఏం జరిగిందంటే?
TeluguStop.com
టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన రామ్ చరణ్( Ram Charan ) కు ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ మూవీ( Game Changer ) ట్రైలర్ మరికొన్ని గంటల్లో విడుదల కానుంది.
ఈ నెల 10వ తేదీన రికార్డ్ స్థాయి స్క్రీన్లలో గేమ్ ఛేంజర్ రిలీజ్ కానుందని తెలుస్తోంది.
ఈ సినిమాకు ఏపీలో బెనిఫిట్ షోలు ఉంటాయో లేదో అనే చర్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది.
అయితే రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అన్ స్టాపబుల్ షోకు( Unstoppable Show ) హాజరయ్యారు.
ఈ షోలో మహేష్ బాబుతో( Mahesh Babu ) కలిసి మల్టీస్టారర్ చేయాలని ఉందని చరణ్ చెప్పినట్టు తెలుస్తోంది.
రామ్ చరణ్ ఇప్పటికే తారక్ తో కలిసి ఆర్.ఆర్.
ఆర్ సినిమాలో నటించగా మహేష్ చరణ్ కాంబోలో సినిమా వస్తే మాత్రం సంచలనం అవుతుంది.
ఇతర హీరోలతో సైతం చరణ్ స్నేహ పూర్వకంగా మెలుగుతున్నారు. """/" /
రామ్ చరణ్ గత సినిమా ఆచార్య బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.
మరోవైపు శంకర్ సినిమాలు ఈ మధ్య కాలంలో బాక్సాఫీస్ వద్ద ఆశించిన రేంజ్ లో హిట్ కాలేదు.
అటు చరణ్ కు ఇటు శంకర్ కు గేమ్ ఛేంజర్ సక్సెస్ సాధించడం కీలకం కాగా ఈ సినిమా ఏ రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
దిల్ రాజు ఈ సినిమా కోసం డబ్బును మంచినీళ్లలా ఖర్చు చేశారు. """/" /
గేమ్ ఛేంజర్ సినిమాలో ట్విస్టులు అద్భుతంగా ఉంటాయని అంజలి పాత్ర సినిమాకు హైలెట్ కానుందని తెలుస్తోంది.
గేమ్ ఛేంజర్ సినిమా వచ్చే శుక్రవారం థియేటర్లలో విడుదల కానుంది.గేమ్ ఛేంజర్ 2025 టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
గేమ్ ఛేంజర్ ఏ రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తుందో చూడాల్సి ఉంది.
ప్రొడ్యూసర్లు గా మారుతున్న మన స్టార్ డైరెక్టర్ల భార్యలు…