ఎంటర్టైన్మెంట్ ఉండగా అవి అవసరమా డార్లింగ్స్.. ప్రభాస్ వీడియో మెసేజ్ వైరల్!
TeluguStop.com
స్టార్ హీరో ప్రభాస్ (star Hero Prabhas)కెరీర్ పరంగా వరుస ప్రాజెక్ట్ లతో ప్రస్తుతం బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
2025 సంవత్సరంలో కన్నప్ప, ఫౌజీ, ది రాజాసాబ్(Kannappa, Fauji, The Rajasaab) సినిమాలతో ప్రభాస్ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
ఈ మూడు సినిమాల బడ్జెట్ 800 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం కావడం గమనార్హం.
మరోవైపు ప్రభాస్ డ్రగ్స్(Prabhas Drugs) కు వ్యతిరేకంగా వీడియో మెసేజ్ చేయడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అయింది.
మన జీవితంలో బోలెడు ఎంజాయ్మెంట్, ఎంటర్టైన్మెంట్(Enjoyment, Entertainment) ఉన్నాయని ప్రభాస్ కామెంట్లు చేశారు.
మనల్ని ప్రేమించే వాళ్లు, మన కోసం బ్రతికే వాళ్లు ఉండగా డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్ అంటూ కామెంట్లు చేశారు.
సే నో టూ డ్రగ్స్ (Say No To Drugs)అంటూ తన ఫ్యాన్స్ కు, సినీ అభిమానులకు ప్రభాస్ సూచనలు చేశారు.
మీకు తెలిసిన వాళ్లు ఎవరైనా డ్రగ్స్ కు బానిసలై ఉంటే 8712671111 నంబర్ కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు.
"""/" /
ఈ ఫోన్ నంబర్ తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకు(Anti-Narcotics Bureau) సంబంధించిన కంట్రోల్ రూమ్ నంబర్ కావడం గమనార్హం.
ఎవరైనా మత్తుకు బానిసై ఉంటే వాళ్లు పూర్తిగా కోలుకునే విధంగా తెలంగాణ సర్కార్ చర్యలు చేపడుతుందని ప్రభాస్ (prabhas)పేర్కొన్నారు.
ప్రభాస్ ఇచ్చిన వీడియో మెసేజ్ ను నెటిజన్లు ఎంతగానో ప్రశంసిస్తున్నారు.ప్రభాస్ రెమ్యునరేషన్ 150 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉంది.
"""/" /
ప్రభాస్ భిన్నమైన ప్రాజెక్ట్స్ కు ప్రాధాన్యత ఇస్తుండగా వేర్వేరు జానర్ల సినిమాలలో ఈ హీరో నటిస్తున్నారు.
ప్రభాస్ భవిష్యత్తు సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.ప్రభాస్ రాబోయే రోజుల్లో మరిన్ని సంచలనాలను సృష్టించాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
రేవంత్ సర్కార్ సూచనలకు అనుగుణంగా టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు డ్రగ్స్ కు వ్యతిరేకంగా అడుగులు వేస్తుండటం కొసమెరుపు.
అంతర్జాతీయ విద్యార్ధులకు భారత్ శుభవార్త .. కొత్తగా రెండు స్పెషల్ వీసాలు