వామ్మో.. ప్రభాస్ ధరించిన టీషర్ట్ ఖరీదు అన్ని వేల రూపాయలా?
TeluguStop.com
టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్ వరుస ప్రాజెక్ట్ లలో నటిస్తూ కెరీర్ పరంగా బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే.
బాహుబలి సిరీస్ సినిమాలు ఊహించని స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకోగా సాహో, రాధేశ్యామ్ నిరాశపరిచినా భవిష్యత్తు ప్రాజెక్ట్ లు ప్రభాస్ కు సక్సెస్ ను అందిస్తాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
అయితే తాజాగా జరిగిన సీతారామం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ప్రభాస్ గెస్ట్ గా హాజరయ్యారనే సంగతి తెలిసిందే.
ఈ ఈవెంట్ లో ప్రభాస్ ధరించిన టీ షర్ట్ హైలెట్ గా నిలిచింది.
ఈ టీషర్త్ ఖరీదు తెలిసి ఫ్యాన్స్ సైతం షాకవుతున్నారు.ప్రభాస్ ధరించిన ఈ టీషర్ట్ ఖరీదు 20,000 రూపాయలు కావడం గమనార్హం.
ప్రభాస్ రేంజ్ కు 20,000 రూపాయలు పెద్ద మొత్తం కాకపోయినా సామాన్య ప్రేక్షకులకు ఈ మొత్తం ఎక్కువ మొత్తమనే సంగతి తెలిసిందే.
ప్రభాస్ కొత్త లుక్ విషయంలో ఫ్యాన్స్ సంతృప్తిని వ్యక్తం చేస్తుండటం గమనార్హం.ప్రభాస్ కొత్త లుక్ లో మరింత అందంగా కనిపిస్తున్నారని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
"""/" / మరోవైపు ప్రభాస్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటారనే చర్చ అభిమానుల మధ్య జోరుగా జరుగుతోంది.
ఎంత ఎదిగినా ఒదిగి ఉండే సింపుల్ హీరోగా ప్రభాస్ కు పేరుంది.ఇతర హీరోలను కూడా గౌరవించే ప్రభాస్ అనవసర వివాదాలకు దూరంగా ఉంటారు.
ప్రభాస్ వచ్చే ఏడాది సలార్, ఆదిపురుష్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. """/" /
ప్రభాస్ మారుతి కాంబో మూవీ, ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబో మూవీ కూడా వచ్చే ఏడాది థియేటర్లలో విడుదలయ్యే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది.
ప్రభాస్ ప్రస్తుతం తెలుగులో మరే స్టార్ హీరో డిమాండ్ చేయని స్థాయిలో రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారు.
సినిమాసినిమాకు ప్రభాస్ కు క్రేజ్ పెరుగుతున్న సంగతి తెలిసిందే.
ప్రభాస్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో సినిమా ఫిక్స్ అయిందట.. ట్విస్ట్ ఏంటంటే?