ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ప్రభాస్.. ఈ స్టార్ హీరోకు ఎవరూ సాటిరారుగా!

టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలంతా రెండేళ్లకు ఒక సినిమాను రిలీజ్ చేస్తూ ఫ్యాన్స్ ను బాధ పెడుతున్నారు.

ఒకప్పుడు వేగంగా సినిమాల్లో నటించిన తమ ఫేవరెట్ హీరోలు ఇప్పుడు నిదానంగా సినిమాలలో నటించడం ఆ సినిమాలు సైతం రిలీజ్ డేట్లను మార్చుకోవడం అభిమానులకు ఏ మాత్రం రుచించడం లేదు.

అయితే ప్రభాస్( Prabhas ) మాత్రం ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారనే చెప్పాలి.13 నెలల గ్యాప్ లో ప్రభాస్ నటించిన ఆదిపురుష్,( Adipurush ) సలార్,( Salaar ) కల్కి( Kalki ) సినిమాలు రిలీజవుతున్నాయి.

ఇంత తక్కువ సమయంలో మూడు సినిమాలను రిలీజ్ చేసిన మరే స్టార్ హీరో లేరని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

ప్రభాస్ కు ఎవరూ సాటిరారని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.ప్రభాస్ వరుసగా సినిమాలలో నటించడం ద్వారా ఇంత వేగంగా సినిమాలను రిలీజ్ చేస్తున్నారు.

"""/" / ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను రిలీజ్ చేయడంతో పాటు ఆ సినిమాలకు అదిరిపోయే రేంజ్ లో బిజినెస్ జరిగేలా చేయడంలో సక్సెస్ అవుతున్నారు.

ప్రభాస్ ఈ ఏడాదే కన్నప్ప సినిమాను( Kannappa Movie ) కూడ రిలీజ్ చేయనున్నారని సమాచారం అందుతోంది.

కన్నప్ప సినిమాలో ప్రభాస్ ఎన్ని నిమిషాల పాటు కనిపిస్తారో తెలియాల్సి ఉంది.కన్నప్ప సినిమా కూడా భారీ బడ్జెట్ మూవీ అనే సంగతి తెలిసిందే.

"""/" / మంచు విష్ణు ఎంతో కష్టపడి భారీ స్టార్ క్యాస్ట్ తో నిర్మిస్తూ నటిస్తున్న ఈ సినిమా విష్ణు కెరీర్ కు హీరోగా, నిర్మాతగా కూడా కీలకం కానుంది.

కాజల్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు.ప్రభాస్ పారితోషికం మాత్రం 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తంగా ఉంది.

కన్నప్ప సినిమాకు మాత్రం ప్రభాస్ ఫ్రీగా పని చేస్తున్నారు.ప్రభాస్ భవిష్యత్తు సినిమాలు ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటాయో చూడాలి.

ట్రంప్ కి ఒక సింహం లాగా ప్రొటెక్షన్ అందించిన లేడీ కమాండో.. విజయశాంతి రేంజ్ లో సేవ్ చేసిందిగా