వేల మందికి తలో రూ.10 వేలు సహాయం చేసిన ప్రభాస్.. ఇలాంటి హీరో ఉండరంటూ?

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్( Prabhas) మంచి మనస్సు గురించి సినిమా ఇండస్ట్రీలో మంచి పేరు ఉంది.

ఎవరు కష్టంలో ఉన్నారని తెలిసినా ప్రభాస్ తన వంతు సహాయం చేసే విషయంలో ముందువరసలో ఉంటారు.

కల్కి 2898 ఏడీ మూవీ( Kalki 2898 AD Movie ) బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

ఈరోజో రేపో ఈ సినిమా కలెక్షన్లు 1000 కోట్ల రూపాయల మార్క్ ను టచ్ చేసే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

అయితే ప్రభాస్ మంచితనంకు సంబంధించి మరో వీడియో వైరల్ అవుతోంది. """/" / కల్కి సినిమా కోసం చేసిన ప్రతి ఒక్కరికీ ప్రభాస్ తలో 10 వేల రూపాయలు ఖాతాలో జమ చేశారని సమాచారం అందుతోంది.

కల్కి క్యాస్టూమ్ టీమ్ కు చెందిన మురళి ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇవ్వగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి.

ఇప్పటివరకు ప్రభాస్ లాంటి హీరోను చూడలేదని మురళి అభిప్రాయపడ్డారు.మురళి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

"""/" / ప్రభాస్ కెరీర్ పరంగా ఒక్కో మెట్టు పైకి ఎదిగి ఈ స్థాయికి చేరుకున్నారు.

ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ పరంగా మరింత ఎదగాలని భావిస్తుండటం గమనార్హం.

ప్రభాస్ ది రాజాసాబ్ సినిమా( Rajasaab )తో మరికొన్ని నెలల్లో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరుగుతున్నాయి.ప్రభాస్ ప్రతి సినిమా 200 నుంచి 600 కోట్ల రూపాయల రేంజ్ బడ్జెట్ తో తెరకెక్కుతుండటం గమనార్హం.

ప్రభాస్ మార్కెట్ కూడా ఊహించని స్థాయిలో పెరగడంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఎంతో సంతోషిస్తున్నారు.

బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రభాస్ బాక్సాఫీస్ ను రాబోయే రోజుల్లో ఏ రేంజ్ లో షేక్ చేస్తారో చూడాలి.

ప్రభాస్ సినిమాల ఎంపిక కూడా నెక్స్ట్ లెవెల్ లో వావ్ అనేలా ఉంది.

వావ్, పక్షిని అద్భుతంగా క్యాచ్ పట్టిన టైగర్‌ఫిష్.. వీడియో వైరల్‌..