రెమ్యునరేషన్ ను రెట్టింపు చేసిన స్టార్ హీరో ప్రభాస్.. ఫౌజీ సినిమాకు అంత తీసుకుంటున్నారా?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్ ( Prabhas )వరుస విజయాలతో కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు.

సలార్, కల్కి 2898 ఏడీ సినిమాలు( Salar, Kalki 2898 AD Movies ) బాక్సాఫీస్ వద్ద ఒక విధంగా అద్భుతాలు క్రియేట్ చేశాయని చెప్పవచ్చు.

ప్రస్తుతం నటిస్తున్న ఒక సినిమాకు సింగిల్ పేమెంట్ గా 75 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్న ప్రభాస్ ఫౌజీ సినిమాకు మాత్రం ఏకంగా 150 కోట్ల రూపాయలు అందుకుంటూ ఉండటం గమనార్హం.

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం 100 కోట్ల రూపాయల ( 100 Crore Rupees )కంటే ఎక్కువ మొత్తం రెమ్యునరేషన్ ను అందుకుంటున్న హీరోలు ప్రభాస్, బన్నీ మాత్రమేనని చెప్పవచ్చు.

మిగతా స్టార్ హీరోలు ఈ టార్గెట్ ను అందుకోవడానికి చాలా సమయం పట్టే ఛాన్స్ అయితే ఉంది.

ప్రభాస్ అంత రెమ్యునరేషన్ ను అందుకుంటున్నా సింపుల్ గా ఉంటూ ప్రశంసలు అందుకుంటున్నారు.

"""/" / ప్రభాస్ భవిష్యత్తు సినిమాలు సైతం భారీ స్థాయిలో ఉండబోతున్నాయి.మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు తమ బ్యానర్ లో తెరకెక్కిన ప్రతి సినిమాను భారీ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు.

ఫౌజీ సినిమాకు హను రాఘవపూడి( Hanu Raghavapudi ) దర్శకత్వం వహిస్తున్నారు.హను రాఘవపూడి సీతారామం తర్వాత తెరకెక్కిస్తున్న సినిమా ఇదే కావడం గమనార్హం.

ఈ సినిమా పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది. """/" / ప్రభాస్ సలార్2, కల్కి2 సినిమాల షూటింగ్ లలో ఎప్పటినుంచి పాల్గొంటారో చూడాల్సి ఉంది.

సలార్2 సినిమాలో ఆసక్తికర ట్విస్టులు ఉండనున్నాయని సమాచారం అందుతోంది.కల్కి సీక్వెల్ ను ఒకింత భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.

ప్రభాస్ తన భవిష్యత్తు సినిమాలతో అంచనాలను మించి మెప్పిస్తారేమో చూడాలి.ప్రభాస్ లుక్స్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

ప్రభాస్ పెళ్లికి సంబంధించిన తీపికబురును చెప్పాలని ఈ స్టార్ హీరో అభిమానులు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు.

ప్రభాస్ రేంజ్ ఊహించని స్థాయిలో పెరుగుతోంది.

వైరల్.. ఇన్‌స్టాగ్రామ్ పరిచయంతో పెళ్లి చేసుకున్న వివాహిత మహిళలు