ఒకేరోజు విడుదలైన ప్రభాస్, అల్లు అర్జున్ సినిమాలు.. విజేత ఎవరంటే?

ఈశ్వర్ సినిమాతో ప్రభాస్ టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా కెరీర్ ను మొదలుపెట్టారు.ప్రభాస్ తొలి సినిమా అయిన ఈశ్వర్ బాక్సాఫీస్ వద్ద యావరేజ్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది.

ప్రభాస్ అభిమానులకు ఈ సినిమా నచ్చినప్పటికీ సాధారణ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఈ సినిమా ఫెయిల్ అయింది.

ఆ తర్వాత ప్రభాస్ హీరోగా రెండో సినిమాగా రాఘవేంద్ర సినిమా సురేష్ కృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కి విడుదలైంది.

అన్షు, శ్వేత అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు.మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందించగా సిమ్రాన్ ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేశారు.

2003 సంవత్సరం మార్చి నెల 28వ తేదీన ఈ సినిమా రిలీజైంది.మంత్రాలయం బ్యాక్ డ్రాప్ లో రాఘవేంద్ర తెరకెక్కుతుందని వచ్చిన వార్తల వల్ల ఈ సినిమాపై భారీస్థాయిలో అంచనాలు పెరగగా ఈ సినిమాపై అంచనాలు పెరగగా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఫెయిల్ అయింది.

"""/"/ ఈ సినిమాకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగినా ప్రేక్షకులను పూర్తిస్థాయిలో ఆకట్టుకోవడంలో ఈ సినిమా ఫెయిలైంది.

ఈ సినిమా రిలీజైన సమయంలో కథ, కథనాలు భాషఇంద్ర సినిమాలను పోలి ఉన్నాయనే కామెంట్లు వినిపించాయి.

ఈ సినిమాలో కామెడీ ట్రాక్ బాగానే ఉన్నా సినిమా మాత్రం సక్సెస్ ను సొంతం చేసుకోలేదు.

ప్రభాస్ ఈ సినిమాలో రెండు షేడ్స్ ఉన్న పాత్రల్లో నటించారు.అయితే ఇదేరోజు విడుదలైన అల్లు అర్జున్ గంగోత్రి మాత్రం అంచనాలను మించి సక్సెస్ సాధించింది.

"""/"/ కె.రాఘవేంద్రరావు డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

గంగోత్రి సినిమాతో బన్నీకి స్టార్ స్టేటస్ దక్కకపోయినా బాగా నటించగలడనే పేరు దక్కింది.

గంగోత్రి మూవీ బన్నీకి డెబ్యూ మూవీ కావడం గమనార్హం.గంగోత్రి మూవీ భారీస్థాయిలో కలెక్షన్లను సాధించింది.

ఆ సినిమాలో రామ్ చరణ్ ఇంట్రడక్షన్ రియల్ కాదా.. అదంతా సీజీ మహిమానా??