తండ్రైన టాలీవుడ్ హీరో నితిన్.. మా కుటుంబంలో న్యూ స్టార్ కు ఆహ్వానం అంటూ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో టాలెంట్ తో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకున్న హీరోలలో నితిన్( Nithin ) ఒకరు కాగా సొంత బ్యానర్ సినిమాలలో నితిన్ ఎక్కువగా నటిస్తూ ప్రశంసలను అందుకుంటున్నారు.

ఈ మధ్య కాలంలో కెరీర్ పరంగా సరైన సక్సెస్ లేని నితిన్ తాజాగా అభిమానులకు ఒక శుభవార్త చెప్పగా ఆ విషయం ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.

తాను తండ్రిని అయ్యానంటూ నితిన్ తన సంతోషాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

నితిన్ భార్య షాలిని( Shalini ) పండంటి మగబిడ్దకు( Baby Boy ) జన్మనిచ్చారు.

నితిన్ చిన్నారి చెయ్యి ఫోటోను పంచుకోవడంతో పాటు మా కుటుంబంలో కొత్త స్టార్ కు ఆహ్వానం అని పోస్ట్ లో పేర్కొన్నారు.

నితిన్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన వెంటనే పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు.

"""/" / 2020 సంవత్సరం నితిన్ షాలిని వివాహం జరిగింది.ప్రస్తుతం నితిన్ రెండు సినిమాలలో నటిస్తుండగా ఈ రెండు సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

నితిన్ పారితోషికం( Nithin Remuneration ) కూడా ఒకింత భారీ స్థాయిలో ఉంది.

అయితే నితిన్ సినిమాల రిలీజ్ డేట్లకు సంబంధించి ఒకింత గందరగోళం నెలకొంది.ఈ సినిమాలు థియేటర్లలో ఎప్పుడు విడుదలవుతాయో చూడాల్సి ఉంది.

"""/" / భవిష్యత్తు సినిమాలతో నితిన్ ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాల్సి ఉంది.

నితిన్ తనకు సక్సెస్ ఇచ్చిన తరహా సినిమాలను ఎంచుకుంటున్నారు.రాబోయే రోజుల్లో నితిన్ సక్సెస్ రేట్ మరింత పెరగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

నితిన్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.నితిన్ చిన్న వయస్సులోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఎన్నో విజయాలను అందుకున్నారు.

రాజమౌళి, వినాయక్ డైరెక్షన్ లో నటించిన నితిన్ కెరీర్ ను సరిగ్గా ప్లాన్ చేసుకుంటే తన సక్సెస్ రేట్ ను మరింత పెంచుకునే ఛాన్స్ ఉంది.

పాన్ ఇండియా లో స్టార్ హీరోల కంటే నిఖిల్ భారీ క్రేజ్ ను సంపాదించుకుంటున్నాడా..?