స్టార్ హీరో మహేష్ మనస్సుకు ఫిదా అవ్వాల్సిందే.. సంపాదనలో అంత మొత్తం పేదలకేనా?

సూపర్ స్టార్ మహేష్ బాబు( Superstar Mahesh Babu ) ఇతర స్టార్ హీరోలతో పోల్చి చూస్తే ఎక్కువ సంఖ్యలో యాడ్స్ లో నటిస్తున్నారనే సంగతి తెలిసిందే.

మహేష్ బాబు సినిమాల ద్వారా సంపాదిస్తున్న డబ్బుతో పోల్చి చూస్తే యాడ్స్ ద్వారా సంపాదిస్తున్న మొత్తం ఎక్కువ కావడం గమనార్హం.

అయితే మహేష్ బాబు ఎక్కువ సంఖ్యలో యాడ్స్ లో నటించడం వెనుక అసలు కారణాలు వేరే ఉన్నాయి.

స్టార్ హీరో మహేష్ మంచి మనస్సుకు ఫిదా అవ్వాల్సిందే అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రతకు చాలామంది సెలబ్రిటీలతో పోల్చి చూస్తే సేవా గుణం ఎక్కువ .

అయితే నమ్రత( Namrata Shirodkar ) చేసే సేవా కార్యక్రమాలకు ఉపయోగించే డబ్బు మహేష్ యాడ్స్ ద్వారా సంపాదించిన డబ్బు కావడం గమనార్హం.

యాడ్స్( Mahesh Babu Ads ) ద్వారా వచ్చిన మొత్తంలో 30 శాతం చారిటీకే మహేష్ బాబు ఖర్చు చేస్తున్నారు.

"""/"/ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ స్థాయిలో చారిటీ కోసం ఖర్చు చేసే హీరో మహేష్ బాబు మాత్రమే అని తెలుస్తోంది.

నేను ఎంత ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తే అంత ఎక్కువ మనీని డొనేట్ చేయగలనని అందుకే ఎక్కువ సంఖ్యలో యాడ్స్( Mahesh Babu Remuneration For Ads ) లో నటిస్తున్నానని అలీకి మహేష్ బాబు ఒక సందర్భంలో వెల్లడించారు.

ఈ విషయం తెలిసిన నెటిజన్లు దటీజ్ మహేష్ బాబు అని కామెంట్లు చేస్తున్నారు.

స్టార్ హీరో మహేష్ బాబును ఎంత మెచ్చుకున్నా తక్కువేనని ఫ్యాన్స్ చెబుతున్నారు. """/"/ 48 సంవత్సరాల వయస్సులో సైతం మహేష్ బాబు లుక్స్( Mahesh Babu New Look ) విషయంలో అదుర్స్ అనిపిస్తున్నారు.

మహేష్ రేంజ్, క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ వేరే లెవెల్ అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

స్టార్ డైరెక్టర్ రాజమౌళి సినిమా పూర్తైన వెంటనే వరుసగా, వేగంగా సినిమాలలో నటించేలా మహేష్ బాబు ప్లానింగ్ ఉంది.

హౌస్ నుంచి బయటకు వచ్చేసిన టేస్టీ తేజ… బిగ్ బాస్ 8 రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?