స్టార్ హీరో కృష్ణ కూతురుకు అంత అన్యాయం జరిగిందా? పెద్దింటి కోడలు అవ్వాల్సిన ఆమె ఇలా?
TeluguStop.com
ప్రస్తుత కాలంలో పెళ్లిళ్లు అంటే పిల్లలు తమకు కాబోయే వాడు ఎలా ఉండాలి ఏంటి అన్న విషయాలను ముందుగానే ఆలోచిస్తూ ఇలాంటి అబ్బాయి భర్తగా రావాలని కోరుకుంటున్నారు.
అలాగే ప్రస్తుత కాలంలో చాలా మంది ప్రేమ వివాహాలు( Love Marriages ) చేసుకోవడం కూడా మనం చూస్తున్నాము.
అయితే ఒకానొక సమయంలో ప్రేమ వివాహాలకు ఎలాంటి తావు ఉండేది కాదు.పెద్దలు చూపించిన అబ్బాయిని పెళ్లి చేసుకుని చక్కగా కాపురం చేసుకునేవారు.
అయితే స్టార్ సెలబ్రిటీల పిల్లల విషయంలో అయితే ఇలాంటి జాగ్రత్తలు మరిన్ని ఎక్కువగా తీసుకునేవారు.
ఒకసారి హీరో లేదా ఒక రాజకీయ నాయకుడు కూతురికి పెళ్లి చేయాలి అంటే వరుడు కుటుంబ సభ్యులకు గురించి పూర్తిగా ఆరా తీసేవారు వారి అటు ఏడు తరాలు ఇటేడు తరాలు చూసి ఆ ఇంటికి తమ కూతురిని కోడలిగా పంపించేవారు.
ఈ క్రమంలోని సూపర్ స్టార్ కృష్ణ ( Krishna ) కుమార్తెలలో ఒకరైనటువంటి మంజుల( Manjula ) గురించి మనకు చెప్పాల్సిన పనిలేదు.
ఈమె ప్రస్తుతం తన వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నారు.అయితే మంజుల వివాహం గురించి తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
"""/" /
నిజానికి మంజులను ఒక స్టార్ హీరో తన కుమారుడికి మంజులను పెళ్లి చేసుకోవాలని భావించారట ఇదే విషయాన్ని కృష్ణ గారి వద్ద చెప్పడంతో కృష్ణ కూడా అందుకు సానుకూలంగానే వ్యవహరించారని తెలుస్తుంది.
ఇక మంజులకి కూడా ఆ స్టార్ హీరో కుమారుడు( Son Of Star Hero ) అంటే కూడా ఇష్టం ఉండటం వల్ల వీరిద్దరికీ పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నారట అయితే అప్పటివరకు కృష్ణ ఏ విధమైనటువంటి జాతకాలను నమ్మేవారు కాదు.
మన నుదిటిన ఉంటే అలా జరుగుతుందని ప్రతి ఒక్క విషయంలోనూ జాతకాలను పక్కనపెట్టి ముందడుగు వేసే వారట అయితే కూతురు పెళ్లి విషయం వచ్చేసరికి కుటుంబ చెప్పడంతో కాదనలేక ఈయన ఆ స్టార్ హీరో కొడుకు మంజుల జాతకాలను పురోహితులకు చూపించారట.
"""/" /
ఈ విధంగా వీరిద్దరి జాతకాలు చూపించడంతో వీరి జాతకంలో దోషం ఉందని వీరిద్దరూ కనుక పెళ్లి చేసుకుంటే ఈ దంపతుల ప్రాణాలు ప్రమాదాలలో పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటూ పండితులు జాతకం గురించి చెప్పడంతో కృష్ణ ఈ పెళ్లి చేయకూడదని నిర్ణయం చేసుకున్నారట.
తన కుమార్తె సంతోషంగా ఉండటమే తనకు ముఖ్యమని భావించినటువంటి కృష్ణ తన కూతురి పెళ్లిని ఆ స్టార్ హీరో కొడుకుతో చేయడానికి ఏమాత్రం ఇష్టపడలేదట.
ఈ విధంగా ఆ హీరో కుమారుడితో మంజుల వివాహం ఆగిపోయినప్పటికీ ప్రస్తుతం ఈమె వేరే వ్యక్తిని వివాహం చేసుకొని తన వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నారో ఇక ఆ స్టార్ హీరో కుమారుడు కూడా పెళ్లి చేసుకుని ప్రస్తుతం తన భార్య పిల్లలతో ఎంతో సంతోషంగా ఉన్నారు.
ఇలా కృష్ణ ఈ పెళ్లి వాయిదా వేయకపోయినా ఉంటే ఈమె ఒక స్టార్ హీరో ఇంటికి కోడలుగా వెళ్లేదని అయితే ఆమె జీవితం ఇంత సంతోషకరంగా ఉండేది కాదని చెప్పాలి.
రూపాయి ఖర్చు లేకుండా జుట్టు రాలే సమస్యకు చెక్ పెట్టండిలా!