DJ టిల్లు సీక్వెల్ లో స్టార్ హీరో.. వారెవ్వా స్కెచ్ అదిరింది..!
TeluguStop.com
సిద్ధార్థ్ జొన్నలగడ్డ, నేహా శెట్టి జోడీగా విమల్ కృష్ణ డైరక్షన్ లో వచ్చిన సినిమా డీజే టిల్లు.
ఈ సినిమాను సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగ వశీ నిర్మించారు.
చిన్న బడ్జెట్ సినిమాల్లో సరికొత్త సంచలనంగా ఈ సినిమా ఫలితాన్ని అందుకుంది.డీజే టిల్లు సినిమా యూత్ ఆడియెన్స్ కి విపరీతంగా నచ్చిందని చెప్పొచ్చు.
ఈ క్రమంలో డీజే టిల్లు సీక్వల్ మీద ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది.డీజే టిల్లు ఖచ్చితంగా వర్క్ అవుట్ అయ్యే ప్రాజెక్ట్ అని.
ఈ సినిమా సీక్వల్ చేస్తే అందులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెమియో రోల్ ఉంటుందని అంటున్నారు.
డీజే టిల్లు సినిమా లో అల్లు అర్జున్ చేస్తే ఆ సినిమా నెక్స్ట్ లెవల్ లో ఉంటుంది.
డీజే టిల్లులో టిల్లు గాడు మ్యూజిక్ డైరక్షన్ ఛాన్స్ వస్తే అల్లు అర్జున్ సినిమాకి చేస్తా అని అంటాడు.
అలాంటి ఓ కాన్సెప్ట్ తోనే బన్నీతో ఓ సీన్ ఫిక్స్ చేస్తున్నారట.సూపర్ హిట్ సినిమా సీక్వల్ లో కెమియో రోల్ అంటే అల్లు అర్జున్ కూడా ఖచ్చితంగా ఓకే చెప్పే అవకాశం ఉంటుంది.
మరి డీజే టిల్లు సీక్వల్ ఎలా ఉండబోతుందో చూడాలి.