బన్నీపై అభిమానంతో విగ్రహం తయారు చేస్తున్న అభిమాని.. అసలేమైందంటే?

స్టార్ హీరో అల్లు అర్జున్ కు తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళలో కూడా ఊహించని స్థాయిలో అభిమానులు ఉన్నారనే విషయం తెలిసిందే.

పుష్ప ది రైజ్ సినిమా సక్సెస్ తో బన్నీ బాలీవుడ్ అభిమానులకు కూడా చేరువయ్యారు.

పుష్ప సినిమా హిందీ హక్కులు తక్కువ రేటుకు అమ్ముడవగా కలెక్షన్లు మాత్రం కళ్లు చెదిరే స్థాయిలో వచ్చాయి.

పుష్ప సినిమాకు ముందే తెలుగు నుంచి హిందీలో డబ్ అయిన సినిమాల ద్వారా బన్నీ బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయ మయ్యారు.

బన్నీ నటించిన సరైనోడు సినిమా హిందీలో యూట్యూబ్ లో రికార్డు స్థాయిలో వ్యూస్ సాధించిన సంగతి తెలిసిందే.

అయితే ఔరంగాబాద్ ప్రాంతానికి చెందిన సోహాన్ కుమార్ అనే వ్యక్తి బన్నీకి చాలా సంవత్సరాల నుంచి వీరాభిమానిగా ఉన్నారు.

బన్నీ స్టైల్, యాక్షన్ కు ఈ అభిమాని ఫిదా అయ్యారు.బన్నీపై ఉండే అభిమానాన్ని ఏదో ఒక విధంగా చాటుకోవాలని ఈ ఫ్యాన్ అనుకున్నారు.

బన్నీపై అభిమానాన్ని చాటు కోవడానికి ఈ ఫ్యాన్ ఏకంగా బన్నీ విగ్రహాన్ని తయారు చేయించారు.

బన్నీ చేతిలో గన్ ఉండేలా బన్నీ పుష్పరాజ్ పాత్రను పోలి ఉండేలా తయారైన ఈ విగ్రహాన్ని చూసి బన్నీ ఫ్యాన్స్ షాకవుతున్నారు.

"""/" / ఏప్రిల్ 8వ తేదీన బన్నీ పుట్టినరోజు కాగా బర్త్ డే కానుకగా ఈ విగ్రహాన్ని అంద జేయాలని సోహాన్ కుమార్ అనుకుంటున్నారు.

పుష్పరాజ్ పాత్రలో బన్నీ యాక్టింగ్ ఊహించని స్థాయిలో నచ్చడంతో సోహాన్ కుమార్ ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం అందుతోంది.

"""/" / అటు థియేటర్లలో, ఇటు ఓటీటీలో పుష్ప హవా కొనసాగుతోంది.తెలుగు రాష్ట్రాల్లో కూడా పలు థియేటర్లలో ఇప్పటికీ ఈ సినిమా ప్రదర్శితమవుతోంది.

పుష్ప సినిమా సక్సెస్ తో ఈ సినిమాకు పని చేసిన వాళ్లు చాలా సంతోషిస్తున్నారు.

ఫైర్ బ్రాండ్ బ్యూటీ రాశి ఖన్నా రెడ్ హాట్ అవుట్ ఫిట్స్