ఆ పని చేయకుండా బాలయ్యకు రోజు గడవదట.. తండ్రిపై ప్రేమ అంటూ?
TeluguStop.com
టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన బాలకృష్ణను అభిమానించే అభిమానులు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవిదేశాల్లో ఉన్నారు.
బాలయ్య నటించిన సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ కావాల్సిందేనని ఇండస్ట్రీలో టాక్ ఉంది.
తండ్రి సీనియర్ ఎన్టీఆర్ పై బాలయ్యకు అమితమైన ప్రేమ, అభిమానం అనే సంగతి తెలిసిందే.
తండ్రి నటించిన సినిమాలను తాను ఎక్కువగా చూస్తానని బాలయ్య పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు.
బాలయ్య తండ్రి పేరుతో పలు సేవా కార్యక్రమాలను చేస్తూ ఆ కార్యక్రమాల ద్వారా కూడా వార్తల్లో నిలుస్తున్నారు.
పెద్దలను గౌరవించే విషయంలో బాలయ్యకు బాలయ్యే సాటి ఆని చెప్పవచ్చు.మహిళలకు బాలయ్య ఎంతో గౌరవం ఇస్తారు.
బాలయ్య గురించి ఇండస్ట్రీలో ఎన్నో రూమర్లు ప్రచారంలో ఉన్నా బాలయ్యతో పని చేసిన చాలామంది హీరోయిన్లు మాత్రం ఆయన గురించి గొప్పగా చెబుతుండటం గమనార్హం.
అయితే ప్రముఖ నటుడు మురళీ మోహన్ ఒక సందర్భంలో బాలకృష్ణ గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
బాలయ్య ఏ ఈవెంట్ లో మాట్లాడినా తమతో మాట్లాడినా కూడా తండ్రి సీనియర్ ఎన్టీఆర్ గురించి కచ్చితంగా మాట్లాడతారని తెలిపారు.
తండ్రిని రోజుకు 100 సార్లు అయినా ఆయన గుర్తు చేసుకుంటారని మురళీ మోహన్ చెప్పుకొచ్చారు.
"""/"/
ఇతర ఇండస్ట్రీల నటులకు సైతం సీనియర్ ఎన్టీఆర్ డిసిప్లీన్ గురించి బాలయ్య గొప్పగా చెబుతారని మురళీ మోహన్ కామెంట్లు చేశారు.
ప్రతిరోజూ బాలకృష్ణ సీనియర్ ఎన్టీఆర్ సినిమాలను, పాటలను కచ్చితంగా చూస్తాడని మురళీ మోహన్ వెల్లడించారు.
తండ్రిని అమితంగా ప్రేమించే బాలకృష్ణ తండ్రిపై ప్రేమను చాటుకునే ఒక్క సందర్భాన్ని కూడా వదులుకోవడానికి ఇష్టపడరనే సంగతి తెలిసిందే.
బాలయ్య ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు హిందూపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు.బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్నారు.
ఛాట్‌జీపీటీపై సంచలన వ్యాఖ్యలు .. అమెరికాలో శవమై తేలిన భారత సంతతి టెక్కీ