స్టార్ హీరో బాలయ్య రెమ్యునరేషన్ ను భారీగా పెంచేశారా.. ఎన్ని రూ.కోట్లో తెలుసా?

టాలీవుడ్ స్టార్ హీరో బాలయ్య( Balayya ) మార్కెట్ కు అనుగుణంగా రెమ్యునరేషన్( Remuneration ) తీసుకుంటున్న సంగతి తెలిసిందే.

అఖండ సినిమాకు ముందు బాలయ్య రెమ్యునరేషన్ 10 కోట్ల రూపాయలు కాగా అఖండ సినిమా నుంచి వరుస విజయాలు సాధిస్తుండటంతో బాలయ్య పారితోషికం సైతం పెరుగుతూ వస్తోంది.

భగవంత్ కేసరికి 18 కోట్ల రూపాయల పారితోషికం అందుకున్న బాలయ్య అఖండ 2( Akhanda 2 ) సినిమాకు రెట్టింపు స్థాయిలో పారితోషికం అందుకుంటున్నారు.

అఖండ 2 సినిమాకు బాలయ్య పారితోషికం ఏకంగా 34 కోట్ల రూపాయలు కావడం గమనార్హం.

సీనియర్ హీరోలలో చిరంజీవి తర్వాత ఆ స్థాయిలో పారితోషికం అందుకోవడం ద్వారా బాలయ్య వార్తల్లో నిలుస్తున్నారు.

నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna ) మార్కెట్ ను అఖండ2 సినిమా ఎన్నో రెట్లు పెంచుతుందని అభిమానులు ఫీలవుతున్నారు.

అఖండ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. """/" / అఖండ2 సినిమాలో ప్రగ్యా జైస్వాల్( Pragya Jaiswal ) ఉంటుందా? లేదా? అనే ప్రశ్నలకు సైతం సమాధానం దొరకాల్సి ఉంది.

అఖండ 2 సినిమా స్క్రిప్ట్ అద్భుతంగా వచ్చిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.అఖండ2 సినిమా బాలయ్య కెరీర్ లో స్పెషల్ మూవీగా నిలుస్తుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

అఖండ2 సినిమాలో యాక్షన్ సీన్స్ వేరే లెవెల్ లో ఉండబోతున్నాయని ప్రచారం జరుగుతోంది.

"""/" / అఖండ సీక్వెల్ బడ్జెట్ ఏకంగా 150 కోట్ల రూపాయలు అని తెలిసి ఇండస్ట్రీ వర్గాలు సైతం షాక్ కు గురవుతున్నాయి.

అఖండ 2 సినిమా పిల్లల నుంచి పెద్దల వరకు అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే సినిమా అవుతుందేమో చూడాల్సి ఉంది.

అఖండ సీక్వెల్ హిట్టైతే మాత్రం పాన్ ఇండియా స్థాయిలో బాలయ్య పేరు మారుమ్రోగుతుందని చెప్పవచ్చు.

స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ సినిమాలు బిజినెస్ పరంగా కూడా అదరగొడుతుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.

సోషల్ మీడియాలో సైతం బాలయ్య యాక్టివ్ గా ఉంటున్నారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలక పరిణామం.. పోటీ నుంచి తప్పుకున్న జో బైడెన్