ఆ హీరోయిన్ అంటే క్రష్ అన్న బాలకృష్ణ.. అభిమానులు సైతం షాకయ్యేలా?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన బాలకృష్ణ 62 సంవత్సరాల వయస్సులో ఏ మాత్రం ఎనర్జీ తగ్గకుండా అన్ స్టాపబుల్ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

ఫస్ట్ ఎపిసోడ్ కు రికార్డ్ స్థాయిలో వ్యూస్ వస్తుండగా సెకండ్ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది.

అందరూ ఊహించిన విధంగానే విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ ఈ షోకు హాజరై ఈ షోలో సందడి చేయడం గమనార్హం.

"""/"/ హారిక హాసిని క్రియేషన్స్, సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాతలలో ఒకరైన నాగవంశీ కూడా ఈ షోకు హాజరై కొంత సమయం పాటు సందడి చేశారు.

అక్టోబర్ 21వ తేదీన ఈ ఎపిసోడ్ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.సిద్ధు జొన్నలగడ్డ హెయిర్ స్టైల్ చూసి ఎవరయ్యా సిద్ధూ బాబుకు తల దువ్వకుండా పంపించారని బాలయ్య కామెంట్ చేశారు.

అది మెస్సీ లుక్ అని సిద్ధు చెప్పగా నేను అలాంటి మెస్సీ లుక్ తో కనబడిన సినిమాలన్నీ మెస్ అయ్యాయంటూ వీరభద్ర, మహారథి సినిమాల గురించి బాలయ్య పరోక్షంగా కామెంట్లు చేశారు.

"""/"/ విశ్వక్ సేన్ మాస్ కా దాస్ అని సిద్ధు జొన్నలగడ్డ మాస్ కా బాస్ అని నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా గాడ్ ఆఫ్ మాస్ అంటూ బాలయ్య తన గురించి తాను చెప్పుకొచ్చారు.

మీ ప్రజెంట్ క్రష్ ఎవరనే ప్రశ్నకు బాలకృష్ణ రష్మిక మందన్న పేరు సమాధానంగా ఇచ్చారు.

బాలయ్య అలా చెప్పడంతో ఫ్యాన్స్ సైతం షాకయ్యారు.త్రివిక్రమ్ బయట సినిమాలు చేయడా అని బాలయ్య అడగగా ఆయన బయటికెళ్లడం మాకిష్టం లేదని నాగవంశీ అన్నారు.

ఆ తర్వాత బాలయ్య త్రివిక్రమ్ తో ఫోన్ లో మాట్లాడుతూ అన్ స్టాపబుల్ కు ఎప్పుడు వస్తున్నావని అడగగా మీరు ఓకే అంటే వెంటనే వస్తాను సార్ అని తెలిపారు.

ఎవరితో రావాలో తెలుసుగా అంటూ బాలయ్య పవన్ తో త్రివిక్రమ్ రావాలని సూచనలు చేయడం గమనార్హం.

బాలయ్య చెమటలు పట్టిస్తున్నారని విశ్వక్ సేన్ కామెంట్లు చేశారు.

వీడియో వైరల్‌: జగన్నాథుడికి వినంభ్రంగా ప్రార్థించిన కోడి..