ఆ సమయంలో పెయింట్ డబ్బాలు పట్టుకుని పెయింట్ వేశా.. బాలయ్య కామెంట్స్ వైరల్!

స్టార్ హీరో బాలయ్య హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ షో ఐదో ఎపిసోడ్ నిన్నటినుంచి ఆహా ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది.

ఈ షోకు రాజమౌళి, కీరవాణి గెస్టులుగా హాజరు కాగా బాలయ్య తన గురించి ఎవరికీ తెలియని చాలా విషయాలను ఈ షోలో చెప్పుకొచ్చారు.

ఆర్ఆర్ఆర్ ట్రైలర్ కు భారీ రెస్పాన్స్ వచ్చిందని బాలయ్య జక్కన్నను ప్రశంసించారు.రాజమౌళి తెల్ల గడ్డం వెనుక ఉన్న కారణం చెప్పాలని బాలయ్య జక్కన్నను అడిగారు.

తనకు గడ్డం గీయాలంటే బద్ధకం అని రాజమౌళి చెప్పగా రెండు మూడు సంవత్సరాలకు ఒక సినిమా అంటే బద్ధకంతోనే అనుకోవాలా? అని బాలయ్య జక్కన్నను ప్రశ్నించారు.

ఆ తర్వాత బాలయ్య దానవీర శూరకర్ణ సినిమా షూటింగ్ సమయంలో నాన్నగారు రేయింబవళ్లు వాడుకున్నారని వాయించేశారని బాలయ్య చెప్పుకొచ్చారు.

ఆ సినిమాకు ఆర్టిస్ట్ గా, టెక్నీషియన్ గా పని చేశానని బాలకృష్ణ వెల్లడించారు.

రాత్రి పడుకునే సమయంలో నాన్న ఈ ఫ్లోర్ డిజైన్ మారిపోవాలని ఆదేశాలు ఇచ్చేవారని నేను, మా అన్నయ్యలు పెయింట్ డబ్బాలు పట్టుకొని పెయింట్ వేసేవాళ్లమని బాలయ్య తెలిపారు.

రాజమౌళి ఫ్యామిలీ అంటే శంకరా భరణం ఫ్యామిలీ అని బాలయ్య పేర్కొన్నారు.టాలీవుడ్ ను పాన్ వరల్డ్ స్థాయికి తీసుకెళ్లిన డైరెక్టర్ రాజమౌళి అని బాలయ్య చెప్పుకొచ్చారు.

నాన్న మోదీగారిని ఫాలో అయ్యి గడ్డం పెంచారా అని బాలయ్య రాజమౌళిని ప్రశ్నించారు.

"""/" / రాజమౌళి సింపుల్ గా ఎందుకు ఉంటారని బాలయ్య అడగ్గా  తనది మిడిల్ క్లాస్ మెంటాలిటీ అని రాజమౌళి చెప్పుకొచ్చారు.

మనస్సులో నాకు సిగరెట్ పట్టుకుని కాలుపై కాలు వేసుకోవాలని ఉంటుందని రాజమౌళి చెప్పుకొచ్చారు.

అలా కోరుకున్నప్పటికీ నాకు నేనే అన్ కంఫర్టబుల్ గా ఫీలవుతానని రాజమౌళి కామెంట్లు చేశారు.

దసరా మూవీని మిస్ చేసుకున్న హీరో.. అసలు విషయం బయటపెట్టిన మ్యూజిక్ డైరెక్టర్!