అప్పుడు టోటల్ రూ.18 కోట్లు.. ఇప్పుడు ఒక్కరోజు కలెక్షన్లు రూ.18 కోట్లు.. బాలయ్య ఎదిగిన తీరుకు ఫిదా అవ్వాల్సిందే!
TeluguStop.com
టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన బాలకృష్ణ భగవంత్ కేసరి ( Bhagwant Kesari )సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నారు.
ఈ సినిమా రెండు రోజుల్లో 50 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను సాధించింది.
ఈ సినిమా టార్గెట్ 70 కోట్ల రూపాయలు కాగా ఇప్పటికే 40 శాతం టార్గెట్ ను రీచ్ అయింది.
ఈ వీకెండ్ కు భగవంత్ కేసరి డామినేషన్ స్పష్టంగా కనిపిస్తోంది.లియో, టైగర్ నాగేశ్వరరావు( Leo, Tiger Nageswara Rao ) సినిమాలకు ఆశించిన టాక్ రాలేదు.
"""/" /
అయితే బాలయ్య గత కొన్నేళ్లలో కెరీర్ పరంగా ఎదిగిన తీరుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
లెజెండ్ తర్వాత అఖండ ముందు బాలయ్య నటించిన సినిమాలు ఆశించిన రేంజ్ లో హిట్ కాలేదు.
రూలర్, జై సింహా( Ruler, Jai Simha ) లాంటి సినిమాలు ఫుల్ రన్ లో కేవలం 18 కోట్ల రూపాయలకు అటూఇటుగా సాధించాయి.
ఇప్పుడు బాలయ్య ఒక్కరోజులో ఆ టార్గెట్ ను సాధించడం గమనార్హం.బాలయ్య గత సినిమా వీరసింహారెడ్డి ఫస్ట్ డే కలెక్షన్లు దాదాపుగా 30 కోట్ల రూపాయల రేంజ్ లో ఉన్నాయి.
"""/" /
వరుసగా ఫ్లాపులు ఎదురైన సమయంలో బాలయ్య నిరాశ చెందలేదు.కథల ఎంపికలో, దర్శకుల ఎంపికలో మారిన బాలయ్య వరుస విజయాలతో బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నారు.
మూవీ క్రిటిక్స్ సైతం దసరా విన్నర్ భగవంత్ కేసరి అని ముక్త కంఠంతో చెబుతున్నారు.
ఈ సినిమాలోని మెసేజ్ సైతం అద్భుతంగా ఉంటుంది.బాలయ్య బాక్సాఫీస్ కు కళ తీసుకొనిరావడంతో పాటు వరుస విజయాలను అందుకుంటున్నారు.
బాలయ్య సినిమాలేవీ ఇప్పటివరకు 100 కోట్ల రూపాయల కలెక్షన్ల మార్కును అందుకోలేదు.ఈ సినిమా నుంచి ఆ లెక్క కూడా మారుతుందని బాలయ్యకు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు దక్కుతాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ లను ఎంచుకుంటున్న బాలయ్య పాన్ ఇండియా విజయాలను భవిష్యత్తులో అందుకుంటారేమో చూడాలి.
నటితో ముంబై ఇండియన్స్ కెప్టెన్ డేటింగ్? వీడియో వైరల్