స్టార్ హీరో అల్లు అర్జున్ పేరు మార్చుకోబోతున్నారా.. వైరల్ అవుతున్న వార్తల్లో నిజమెంత?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) కు ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

చాలామంది హీరోలతో పోల్చి చూస్తే బన్నీ సక్సెస్ రేట్ కూడా ఎక్కువేననే సంగతి తెలిసిందే.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న్యూమరాలజీ ప్రకారం పేరులో స్వల్పంగా మార్పులు చేసుకోనున్నారని సమాచారం అందుతోంది.

పుష్ప2 సినిమా( Pushpa 2 Movie ) బాక్సాఫీస్ వద్ద రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధించింది.

బన్నీ తర్వాత సినిమాలలో ఒక సినిమా త్రివిక్రమ్( Trivikram ) డైరెక్షన్ లో తెరకెక్కనుండగా మరో సినిమా అట్లీ ( Atlee )డైరెక్షన్ లో తెరకెక్కనుంది.

అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఈ రెండు ప్రాజెక్ట్ లకు సంబంధించి అధికారిక ప్రకటనలు వెలువడనున్నాయని తెలుస్తోంది.

అదే రోజున బన్నీ పేరులో ఉ లేదా న్ లెటర్ యాడ్ చేస్తున్నట్టు ప్రకటన రానుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

"""/" / బన్నీ పుట్టినరోజుకు మరో వారం రోజుల సమయం ఉండగా ఆరోజున ఈ వార్త నిజమో కాదో తేలిపోనుంది.

ఈ మధ్య కాలంలో పలు వివాదాల ద్వారా బన్నీ పేరు వార్తల్లో నిలిచిన నేపథ్యంలో బన్నీ పేరును మార్చుకుంటున్నారని తెలుస్తోంది.

అల్లు అర్జున్ రెమ్యునరేషన్ 200 కోట్ల రూపాయలకు( Remuneration For Rs 200 Crore ) అటూఇటుగా ఉండనుందని సమాచారం అందుతోంది.

బన్నీ క్రేజ్ సైతం అంతకంతకూ పెరుగుతోంది. """/" / ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇతర భాషల్లో సైతం సక్సెస్ సాధించి మరిన్ని రికార్డులు క్రియేట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది.

ఈ ఏడాది బన్నీ సినిమాలేవీ రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదు.2026లో కూడా బన్నీ అట్లీ కాంబో మూవీ మాత్రమే విడుదలయ్యే ఛాన్స్ అయితే ఉందని తెలుస్తోంది.

బన్నీ త్రివిక్రమ్ కాంబో మూవీ మైథలాజికల్ టచ్ తో తెరకెక్కనుందని అధికారిక ప్రకటన కచ్చితంగా రానుందని తెలుస్తోంది.

హారిక హసిని, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.