ఈ హీరోయిన్స్ అందరికి చీరలు కట్టిన స్టార్ డైరెక్టర్ ఎవరో తెలుసా ?
TeluguStop.com
గతంలో స్టార్ డైరెక్టర్ అయిన డైరెక్టర్ అయిన కూడా వారికి సినిమాపై ఉండే శ్రద్ధ ఎలా ఉండేది.
అంటే ప్రతి విషయాన్ని స్వయంగా వారే చెక్ చేసుకునేవారు.ఏ చిన్న పొరపాటు జరగకుండా అన్ని ముందే సిద్ధంగా చేసుకొని సినిమా తీసేవారు.
బడ్జెట్లో పూర్తి చేసేవారు ఇప్పుడైతే కాస్టింగ్ కౌచ్ అంటూ పెద్ద పెద్ద పదాలు వాడుతున్నారు.
అయితే కాస్త వెనక్కి వెళితే స్టార్ డైరెక్టర్ గా దిగ్గజాలుగా పేరు ఉన్న దర్శకులు అందరూ ఏకంగా హీరోయిన్స్ వేసుకునే బట్టలు ఎలా కట్టాలి, ఎలా బొట్టు పెట్టాలి వంటివి అన్ని దగ్గర ఉండి చూసుకునేవారు.
కొన్ని సందర్భాల్లో దర్శకుడు ఎలా కట్టాలో కూడా చూపించిన సంఘటనలు ఉన్నాయి.ఎందుకంటే వారికి సంబంధించి సినిమానే ప్రాణం.
సినిమా సాంఘికమైన అది సమాజానికి ఎంతగా ఉపయోగపడినా వారు అనుకున్న విషయాన్ని అద్భుతమైన కళా ఖండంగా తీర్చిదిద్దడమే వారి బాధ్యత.
"""/" /
అందుకే వారికి సంబంధించి వారి హీరోయిన్ ఎలా ఉండేది అనే విషయంపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచేవారు.
ఆహార్యం విషయంలో కూడా వారి జాగ్రత్తలు బాగా కనిపిస్తాయి.సిరి సిరి మువ్వా, సీతాకోక చిలుక, సీతామాలక్ష్మి వంటి సినిమాలను చూస్తే ఇవన్నీ కూడా సాంఘిక చిత్రాలు అంటే సోషల్ మెసేజ్ ఉన్న సినిమాలు.
ఈ సినిమాల్లో కళాత్మకతకు ప్రాధాన్యత ఉంటుంది.అందుకే హీరోయిన్స్ అందంగా ఉండేలా చూసుకోవడం పై ప్రత్యేక శ్రద్ధ ఉండేది.
అందంగా ఉండడం అంటే బట్టలు తక్కువగా వేసుకోవడం కాదు చీర కట్టుకున్న కూడా స్క్రీన్ షో చేయకుండా కూడా ఆకట్టుకునేలా బట్టలు వేసుకోవడమే వారి ముఖ్య ఉద్దేశం.
"""/" /
బాలచందర్, విశ్వనాథ్, బాలు మహేంద్ర వంటి దిగ్గజ దర్శకుల సినిమాలు చూస్తే వారు ఎంచుకున్న హీరోయిన్స్, ఆ హీరోయిన్స్ ధరించిన బట్టలపై ఫుల్ ఫోకస్ ఉండేది.
నిజానికి విశ్వనాథ్, బాలచందర్ సినిమాల్లో కాస్ట్యూమ్ డిజైనర్స్ ఉండేవారు కాదు అన్ని వారే దగ్గరుండి చూసుకునేవారు.
ఇక కొన్ని సందర్భాల్లో విభిన్నమైన వస్త్రాధారణ ఎంపిక విశ్వనాథ్ గారు దగ్గరుండి చేసేవారు.
"""/" /
హీరోయిన్స్ కి అనేక సందర్భాల్లో ఆయన చీర కట్టారు అంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు.
లోదుస్తులు ధరించిన హీరోయిన్ కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆయన చీర కట్టే విధానం అప్పట్లో పెను సంచలనం.
కళాత్మక దృష్టితోనే ఈ విషయాన్ని చూడాలని చెప్పేవారు.సినిమా బాగోలేకపోతే తన హీరోయిన్ అందంగా కనిపించకపోతే నష్టం ఎక్కువగా ఉంటుంది కాబట్టి విశ్వనాథ్ ఈ విషయంలో జాగ్రత్తగా ఉండేవారు.
పవన్ కళ్యాణ్ పేరు తలుచుకుంటే చాలు ఆక్సిజన్ లభిస్తుంది: చంద్ర బోస్