సీఎం జగన్ పై సినిమా గురించి వర్మ షాకింగ్ రియాక్షన్.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కొన్నేళ్ల క్రితం ఏపీలోని ప్రముఖ రాజకీయ నాయకులను టార్గెట్ చేస్తూ సినిమాలను తెరకెక్కించారు.

ఆ సమయంలో ఆర్జీవీపై విమర్శలు వ్యక్తమైనా ఆ విమర్శలను ఆయన ఏ మాత్రం పట్టించుకోలేదు.

మరోవైపు వర్మ పలు సందర్భాల్లో ఏపీ సీఎం జగన్ కు తాను అభిమానినని చెప్పుకొచ్చారు.

సీఎం జగన్ ను తన సినిమాల్లో నెగిటివ్ గా చూపించడానికి వర్మ అస్సలు ఇష్టపడరు.

అయితే ఏపీ ప్రభుత్వం టికెట్ రేట్ల విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని మాత్రం వర్మ తప్పుబట్టారు.

పలువురు వైసీపీ ఎమ్మెల్యేలపై కూడా వర్మ ఫైర్ అయ్యారనే సంగతి తెలిసిందే.అయితే జగన్ పై మాత్రం వర్మ విమర్శలు చేయలేదు.

తాజాగా వర్మ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమానికి హాజరయ్యారు.ప్రోమోలో వర్మ యంగ్ పీపుల్ తో కలిసి పని చేస్తే మనం ఇంకా యంగ్ అని మనకు అనిపిస్తుందని చెప్పుకొచ్చారు.

"""/" / వయస్సు పెరిగే కొద్దీ తనకు జ్ఞానం పెరుగుతోందని వర్మ కామెంట్లు చేశారు.

బుద్ధుడికి బోధి చెట్టు కింద జ్ఞానోదయం అయినట్టు నాకు బార్ లో జ్ఞానోదయం అయిందని వర్మ వెల్లడించారు.

నాలా ఎవరూ ట్విట్టర్ లో టికెట్ రేట్ల గురించి అడగలేదని వర్మ అన్నారు.

జగన్ కు వ్యతిరేకంగా సినిమా తీయగలరా అనే ప్రశ్నకు ఆర్జీవీ షాకింగ్ రియాక్షన్ ఇచ్చారు.

వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు కాళ్లను కొట్టడం గురించి సినిమా తీస్తారా అనే ప్రశ్నకు అది చాలా స్మాల్ ఇన్సిడెంట్ అని అని వర్మ అన్నారు.

"""/" / రఘురామ కృష్ణంరాజు గురించి రెండు గంటల సినిమా తెరకెక్కించడం కష్టమని వర్మ వెల్లడించారు.

ఆర్కే మాత్రం వర్మ వోడ్కా వేసుకుంటే స్టోరీ తయారు చేయడం ఎంతసేపు అని అన్నారు.

వివేకానందరెడ్డి హత్య గురించి తీయాలని ఆ తర్వాత అర్కే వర్మను కోరారు.ఆదివారం రోజు రాత్రి ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది.

ఆడపిల్లకు చదువెందుకని హేళన.. తొలి ప్రయత్నంలో జడ్జి.. మేఘన సక్సెస్ కు హ్యాట్సాఫ్ అనాల్సిందే!