ప్రశాంత్ నీల్ సొంతూరు ఏపీలో ఆ జిల్లానా.. అందుకే అలా చేశారంటూ?
TeluguStop.com
స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కన్నడ సినిమాలను తెరకెక్కించడం ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్నారనే సంగతి తెలిసిందే.
కేజీఎఫ్2 సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన రికార్డులను సొంతం చేసుకుంటోంది.ఈ వీకెండ్ లో కూడా ఈ సినిమాకు భారీస్థాయిలో కలెక్షన్లు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని తెలుస్తోంది.
అయితే ప్రశాంత్ నీల్ తాజాగా తనది ఆంధ్రప్రదేశ్ అని వెల్లడించారు.నాన్నమ్మ మరణం గురించి ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రశాంత్ నీల్ ది అనంతపురం జిల్లా అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుండగా అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది.
మరోవైపు ప్రశాంత్ నీల్ ప్రస్తుతం తెలుగు హీరోలపైనే దృష్టి పెట్టారు.ప్రభాస్, ఎన్టీఆర్ లతో ప్రశాంత్ నీల్ సినిమాలను తెరకెక్కించనున్నారు.
సలార్ మూవీ షూటింగ్ త్వరలో మళ్లీ మొదలుకానుంది. """/" /
సలార్ మూవీ షూటింగ్ ను పూర్తి చేసి ప్రశాంత్ నీల్ తారక్ ప్రాజెక్ట్ పై దృష్టి పెట్టనున్నారు.
ప్రశాంత్ నీల్ భవిష్యత్తులో తెరకెక్కించే సినిమాలకు సంబంధించిన స్క్రిప్ట్ లను కూడా ఇప్పటికే సిద్ధం చేశారని తెలుస్తోంది.
రాజమౌళికి ప్రశాంత్ నీల్ గట్టి పోటీ ఇస్తున్నారని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ప్రశాంత్ నీల్ మూడు సినిమాలతోనే పాన్ ఇండియా డైరెక్టర్ గా ఎదిగారు. """/" /
ప్రశాంత్ నీల్ భవిష్యత్తు ప్రాజెక్టులు కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయనే సంగతి తెలిసిందే.
కేజీఎఫ్2 సక్సెస్ తో సలార్ మూవీ బడ్జెట్ మరింత పెరిగిందని వార్తలు వస్తున్నాయి.
కేజీఎఫ్2 ఫుల్ రన్ లో ఏ స్థాయిలో కలెక్షన్లను సాధించి కొత్త రికార్డులను అందుకుంటుందో చూడాల్సి ఉంది.
ప్రశాంత్ నీల్ సినిమాకు రెమ్యునరేషన్ తో పాటు లాభాల్లో వాటా తీసుకుంటున్నారు.ప్రశాంత్ నీల్ కూడా దర్శకుడు రాజమౌళిని ఫాలో అవుతున్నారని తెలుస్తోంది.
అరటి తొక్కతో ఇలా చేశారంటే మీ స్కిన్ సూపర్ వైట్ గా మారడం ఖాయం!