మెగా హీరో తో సినిమాకి కమిట్ అయిన స్టార్ డైరెక్టర్ క్రిష్…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు క్రిష్( Director Krish ) ఈయన చేసిన ప్రతి సినిమా కూడా మంచి గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా ఏర్పాటు చేసింది.

ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశం అయితే ఉంటుంది.

అందులో భాగంగానే ఆయన కూడా చేసేటప్పుడు చాలా కొత్త రకం కథలను ఎంచుకొని దానికి అనుగుణమైన స్క్రీన్ ప్లే ను రెడీ చేసి అప్పుడు ఆ సినిమాను సెట్స్ మీదకి తీసుకెళ్తాడు.

ఇక దానికి అనుకూలంగా మెగా హీరో అయిన వరుణ్ తేజ్ తో ఒక సినిమా చేయబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.

"""/" / ఇక మొత్తానికైతే ఈ సినిమాతో వరుణ్ తేజ్( Varun Tej ) మరోసారి క్రిష్ డైరెక్షన్ లో నటించబోతున్నాడు కాబట్టి ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సాధిస్తుంది అని అందరూ కూడా వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

ఇక ఇంతకు ముందే వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన కంచె సినిమా మంచి విజయాన్ని సాధించింది.

ఇక దానికి అనుగుణంగానే ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందనే ఉద్దేశంలో చాలామంది అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు చూడాలి మరి ఈ సినిమాతో అయినా ఎలాంటి సక్సెస్ సాధిస్తాడు అనేది.

"""/" / ఇక హరిహర వీరమల్లు సినిమా ( Harihara Veeramallu Movie )నుంచి తప్పుకున్న క్రిష్ ఇప్పుడు మళ్లీ మెగా హీరో తోనే సినిమా చేయడం అనేది నిజంగా ఒక వంతుకు మంచి విషయం అనే చెప్పాలి.

అయితే హరిహర వీరమల్లు సినిమా నుంచి ఆయన కావాలని తప్పుకోలేదు సినిమా అనేది డిలే అవుతూ వస్తుంది.

కాబట్టి అన్ని రోజులు దానిమీద సమయం కేటాయించాలి అంటే ఆయన కు కూడా టైమ్ సరిపోవట్లేదు అనే ఉద్దేశంతోనే ఆయన ఈ సినిమాని రిజెక్ట్ చేసినట్టుగా తెలుస్తోంది.

అమెరికా అధ్యక్ష ఎన్నికలు : హాట్ హాట్‌ ట్రంప్ – బైడెన్ డిబేట్ .. ఇద్దరూ తగ్గట్లేదుగా ..!!