ఆ సీక్వెల్ లో నెగిటివ్ రోల్ చేయనున్న స్టార్ డైరెక్టర్.. మరి మెప్పిస్తాడా?

కోలీవుడ్ స్టార్ హీరోల్లో కార్తీ ఒకరు.ఈయన హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ఖైదీఇది తమిళ్ లో మాత్రమే కాదు.

తెలుగులో కూడా మంచి హిట్ అయ్యింది.ఇక ఇప్పుడు ఖైదీ సినిమా సీక్వెల్ ను రూపొందించే పనిలో లోకేష్ ఉన్నట్టు తెలుస్తుంది.

ఈ సినిమా రిలీజ్ సమయంలోనే దీనికి సీక్వెల్ ఉంటుంది అని కన్ఫర్మ్ చేసారు.

ఖైదీ సీక్వెల్ కు ముందే లోకేష్ కమల్ హాసన్ హీరోగా విక్రమ్ సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే.

ఈ సినిమాతో లోకేష్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు.ఇక ఈ సినిమాతో మంచి గుర్తింపు దక్కించుకున్న లోకేష్ ఇప్పుడు ఈ సీక్వెల్ మీద కూడా ఫోకస్ పెట్టాడు.

విక్రమ్ లో ఖాదీ తాలూకు ఇన్ పుట్స్ చూపించిన లోకేష్ ఖైదీ సీక్వెల్ లో విక్రమ్ స్టార్ రోలెక్స్ టీమ్ లోని ఒక వ్యక్తికి విలన్ గా చూపించ బోతున్నారు అని ఆ వ్యక్తి ప్రముఖ స్టార్ డైరెక్టర్ అని తెలుస్తుంది.

"""/"/ మరి ఆ స్టార్ నటుడు కమ్ డైరెక్టర్ ఎవరంటే.రాఘవ లారెన్స్ అని తెలుస్తుంది.

ఈ వార్తలు ఇప్పుడు తమిళ్ మీడియాలో వైరల్ అయ్యాయి.ఖైదీ 2 లో రాఘవ లారెన్స్ విలన్ పాత్ర చేయబోతున్నట్టుగా ప్రచారం జరుగుతుంది.

ఇప్పటి వరకు కొరియోగ్రాఫర్ గా మాత్రమే కాకుండా డైరెక్టర్ గా.నటుడిగా.

నిర్మాతగా తన లోని అన్ని కోణాలు చూపించిన రాఘవ మొదటిసారి విలన్ రోల్ లో నటించ బోతున్నాడు అంటేనే అంచనాలు పెరుగుతున్నాయి.

ఈయనకు తెలుగులో కూడా మంచి గుర్తింపు ఉండడంతో ఈ సినిమాకు ఇక్కడ కూడా హైప్ పెరిగే అవకాశం ఉంది.

కాబట్టి ఈ సినిమా అన్ని బాషల వారిని మెప్పిస్తుంది అని మేకర్స్ కూడా భావిస్తున్నారు.

ఇదిలా ఉండగా లారెన్స్ ప్రెజెంట్ చంద్రముఖి 2 సినిమాతో బిజీగా ఉన్నాడు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఫిబ్రవరి4, మంగళవారం 2025