ప్రముఖ కమెడియన్ సునీల్ జాబితాలో 10,000 సినిమాలు.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ కమెడియన్లలో సునీల్ కూడా ఒకరనే సంగతి తెలిసిందే.బ్రహ్మానందం తర్వాత ఆ రేంజ్ లో బిజీ అయిన కమెడియన్ ఎవరనే ప్రశ్నకు సునీల్ పేరు సమాధానంగా వినిపిస్తోంది.

ఎన్నో పెద్ద సినిమాల సక్సెస్ లో సునీల్ కీలక పాత్ర పోషించారు.త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలలో సునీల్ కు మంచి పాత్రలు దక్కగా ఆ పాత్రల వల్ల సునీల్ కెరీర్ విషయంలో మరింత ఎత్తుకు ఎదిగారు.

అయితే సినిమాలలో నటించడమే కాకుండా సినిమాలు చూడటానికి తెగ ఇష్టపడే హీరోలలో ఒకరైన సునీల్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

సినిమా సీడీలను కలెక్ట్ చేయడం అంటే తనకు ఎంతో ఇష్టమని తన ఇంట్లో 12,000 సీడీలు ఉన్నాయని అన్నీ ఒరిజినల్ సీడీలని ఏ దేశం వెళ్లినా సీడీలు కొనుక్కుంటానని సునీల్ కామెంట్లు చేశారు.

ముందు తరాల నటనను చూడటం చాలా ఇష్టమని సునీల్ అన్నారు.వరల్డ్ సినిమా గురించి తెలుసుకోవడం తనకు ఆసక్తి అని సునీల్ కామెంట్లు చేశారు.

అన్ని భాషల సీడీలను తాను కొనుగోలు చేశానని అయితే ఇప్పటివరకు ఆ సినిమాలలో 2,000 సినిమాలను మాత్రమే చూడగలిగానని ఆయన తెలిపారు.

తాను చూడాల్సిన సినిమాలు 10,000 ఉన్నాయని అయితే లైఫ్ టైమ్ లో అన్ని సినిమాలు చూడటం మాత్రం సాధ్యం కాదని ఆయన కామెంట్లు చేశారు.

మనం ఇప్పుడేదో చేస్తున్నామని భావిస్తున్నామని పెద్దోళ్లు అవి ఎప్పుడో చేసేశారని సునీల్ తెలిపారు.

"""/"/ మన పెద్దవాళ్లు కామెడీ, యాక్షన్ లో చూపించని వేరియేషన్ లేదని సునీల్ కామెంట్లు చేశారు.

ఎఫ్3 సినిమాలో సునీల్ కామెడీకి మంచి మార్కులు పడ్డాయి.కమర్షియల్ గా కూడా ఈ సినిమా సక్సెస్ సాధించింది.

ఎఫ్3 సక్సెస్ తో సునీల్ కు ఆఫర్లు పెరగడం గ్యారంటీ అని చెప్పవచ్చు.

సిఎం జగన్ మోహన్ రెడ్డికి బహిరంగ లేఖ రాసిన స్వర్గీయ వైఎస్ వివేకానంద రెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ