స్టార్ కమెడియన్ గీతాసింగ్ కొడుకు మృతి.. ప్రమాదానికి అదే కారణమంటూ?
TeluguStop.com
టాలీవుడ్ స్టార్ కమెడియన్లలో గీతాసింగ్ ఒకరు కితకితలు సినిమా నటిగా ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది.
నరేష్ హీరోగా తెరకెక్కిన సినిమాలలో ఎక్కువగా గీతాసింగ్ నటించారు.అయితే ఈ స్టార్ కమెడియన్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది.
గీతాసింగ్ దత్తత తీసుకున్న కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.ప్రముఖ నటి కరాటే కళ్యాణి సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు.
గీతాసింగ్ కు నిజానికి పెళ్లి కాలేదు.అన్నయ్య కొడుకులను దత్తత తీసుకుని ఆమె పెంచుకుంటున్నారు.
కర్ణాటక రాష్ట్రంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.
కరాటే కళ్యాణి తన పోస్ట్ లో కారులో అయినా బైక్ పై అయినా పిల్లలు జాగ్రత్తగా వెళ్లాలని పేర్కొన్నారు.
కమెడియన్ గీతా సింగ్ కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని ఓం శాంతి అంటూ ఆమె చెప్పుకొచ్చారు.
"""/" /
కరాటే కళ్యాణి చేసిన ఈ ఫేస్ బుక్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
గీతా సింగ్ పెద్దబ్బాయి ప్రమాదంలో మృతి చెందినట్టు తెలుస్తోంది.ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు.భగవంతుడు గీతాసింగ్ కు మనో ధైర్యాన్ని ప్రసాదించాలని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.
"""/" /
ఈ మధ్య కాలంలో గీతాసింగ్ కు సినిమా ఆఫర్లు కూడా ఎక్కువగా రావడం లేదు.
సినిమాలలో గీతాసింగ్ ఎక్కువగా కామెడీ రోల్స్ లో, హీరోయిన్స్ ఫ్రెండ్ పాత్రల్లో కనిపించారు.
కొన్ని సినిమాలలో నటించడం కోసం ఆమె బరువు పెరిగారు.గీతాసింగ్ కొడుకు మృతికి సినీ, రాజకీయ ప్రముఖులు సైతం సంతాపం తెలియజేస్తున్నారు.
ఈ బాధ నుంచి ఆమె త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
ఘనంగా పీవీ సింధు వివాహ రిసెప్షన్… సందడి చేసిన సినీ తారలు!