చిన్నప్పుడు ప్యాంట్ దొంగతనం చేశా.. కష్టాలు చెప్పుకున్న చమ్మక్ చంద్ర?
TeluguStop.com
బుల్లితెర కామెడీ షో జబర్దస్త్, అదిరింది షో, సినిమాల ద్వారా పాపులారిటీని సంపాదించుకున్న వాళ్లలో చమ్మక్ చంద్ర ఒకరు.
చమ్మక్ చంద్ర ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా నటించానని చమ్మక్ చంద్ర తెలిపారు.
అయితే లేడీ గెటప్ ఉన్న కొన్ని సినిమాలను రిజెక్ట్ చేశానని చమ్మక్ చంద్ర పేర్కొన్నారు.
కోపంలో ఎవరినైనా తిడితే సారీ చెబుతానని చమ్మక్ చంద్ర చెప్పుకొచ్చారు.కోపం వస్తే తప్పు నాదో అవతలి వ్యక్తిదో చూస్తానని కోపాలకు తాను దూరంగా ఉంటానని చమ్మక్ చంద్ర తెలిపారు.
ఊరిలో చేసిన చిలిపి పనుల గురించి చెబుతూ చదువుకునే సమయంలో 4వ తరగతిలో లాగు వేసుకునేవాడినని తన అత్త కొడుకు 7వ తరగతి చదువుకునేవాడని అత్త కొడుకు యొక్క ప్యాంట్ ను తాను తీసుకొచ్చానని ఆ ప్యాంట్ ఇంట్లో దాచుకుని తొడుక్కున్నానని చమ్మక్ చంద్ర వెల్లడించారు.
రెండు రోజుల తర్వాత అత్త రాగా చుట్టపు చూపుగా వచ్చారని అనుకున్నానని అయితే అత్త కొడుకు తాను ప్యాంట్ ఎత్తుకెళ్లానని పిలిపించాడని తర్వాత తెలిసిందని చమ్మక్ చంద్ర వెల్లడించారు.
తాను ప్యాంట్ ఇవ్వనంటే ఇవ్వనని చెప్పానని అమ్మ కొట్టిందని చమ్మక్ చంద్ర పేర్కొన్నారు.
ఆరోజు ప్యాంట్ రిటర్న్ ఇచ్చే సమయంలో చాలా బాధ పడ్డానని చమ్మక్ చంద్ర వెల్లడించారు.
"""/"/
తాను వేషాలు ఇవ్వమని కూడా డైరెక్టర్లను ఇబ్బంది పెట్టనని మనకు పాత్ర ఉంటే ఖచ్చితంగా అవకాశం వస్తుందని చమ్మక్ చంద్ర చెప్పుకొచ్చారు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాలలో తనకు ఎక్కువగా ఆఫర్లు వస్తున్నాయని అ ఆ సినిమా నుంచి అరవింద సమేత వరకు త్రివిక్రమ్ సినిమాలలో తనకు ఆఫర్ దక్కిందని చమ్మక్ చంద్ర వెల్లడించారు.
అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న సినిమా ఏ జానర్ లో తెరకెక్కుతుందో తెలుసా..?