కూలీ సినిమాలో పెరిగిపోతున్న స్టార్ కాస్టింగ్…బడ్జెట్ పెరిగిపోతుందా..?

తమిళ్ సినిమా ఇండస్ట్రీలో రజినీకాంత్ ( Rajinikanth )తనదైన రీతిలో సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు.

ఇక సూపర్ స్టార్ గా తనకంటూ ఉన్న ఇమేజ్ ని మరోసారి ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే ఉద్దేశ్యం తోనే రజినీకాంత్ ఈ సినిమాలను చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

ఇక ప్రస్తుతం 70 సంవత్సరాలకు పైబడిన రజనీకాంత్ యంగ్ హీరోలకు సైతం పోటీని ఇస్తూ ఇండస్ట్రీలో తనదైన రీతిలో ముందుకు సాగుతూ ఉండడం అనేది నిజంగా ఒక గొప్ప విషయం అనే చెప్పాలి.

ఇక ప్రస్తుతం ఆయన లోకేష్ కనకరాజ్ ( Lokesh Kanakaraj )దర్శకత్వంలో కూలీ అనే సినిమా చేస్తున్నాడు.

అయితే ఈ సినిమాలో రజనీకాంత్ తో పాటు స్టార్ కాస్టింగ్ భారీగా ఉందనే చెప్పాలి.

"""/" / ఇప్పటికే ఈ సినిమాలో ఉపేంద్ర, నాగార్జునలతో( Upendra , Nagarjuna ) పాటు మరి కొంతమంది స్టార్ యాక్టర్లు కూడా నటించబోతున్నట్టుగా తెలుస్తుంది.

మరి దీని ద్వారా ఈ సినిమా బడ్జెట్ భారీగా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి.

మరి వీటన్నింటికీ ప్రొడ్యూసర్స్ ఎలా తట్టుకుంటారు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.నిజానికైతే విక్రమ్( Vikram ) సినిమాతో భారీ సక్సెస్ ని అందుకున్న లోకేష్ కనకరాజ్ అప్పట్నుంచి భారీ బడ్జెట్ సినిమాలోను తెరకెక్కిస్తున్నాడు.

"""/" / ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాతో తనను తాను మరొకసారి స్టార్ డైరెక్టర్ గా ఎలివేట్ చేసుకోవాలని చూస్తున్నాడు.

సినిమా సూపర్ సక్సెస్ అయితే పర్లేదు గాని ఒకవేళ సినిమా కనక తేడా కొడితే ప్రొడ్యూసర్ మాత్రం భారీగా నష్టాలను చవిచూడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది.

మరి ఇలాంటి క్రమంలో రజినీకాంత్ లాంటి స్టార్ హీరో ఉన్నప్పటికీ భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా మనీని రికవర్ చేస్తుందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

ఇక ఇప్పటికే ఈ సినిమా కోసం దాదాపు 200 కోట్లు బడ్జెట్ ని కేటాయిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది.

పులినే తరిమికొట్టిన పెంపుడు కుక్క.. ఈ వీడియో చూస్తే..