బుల్లితెరపై సక్సెస్ వెండితెరపై ఫెయిల్.. ఈ యాంకర్ల జాతకం అస్సలు బాలేదా?
TeluguStop.com
సాధారణంగా ఈ మధ్య కాలంలో కొందరు స్టార్ హీరోలు వెండితెరపై విజయాలను సొంతం చేసుకుని బుల్లితెరపై కూడా సక్సెస్ అయ్యే దిశగా అడుగులు వేస్తున్నారు.
రానా, జూనియర్ ఎన్టీఆర్, నాగార్జున, చిరంజీవి, బాలకృష్ణ బుల్లితెరపై, ఓటీటీలలో షోల ద్వారా సత్తా చాటారు.
ఒకవైపు సినిమాలలో నటిస్తూనే ఈ సెలబ్రిటీలు టీవీ షోల ద్వారా, ఓటీటీ షోల ద్వారా కూడా సత్తా చాటుతున్నారు.
అయితే బుల్లితెర యాంకర్లు మాత్రం టీవీ షోలలో సక్సెస్ అవుతున్నా వెండితెరపై హీరోయిన్లుగా మాత్రం సక్సెస్ కావడం లేదు.
హీరోయిన్ల పాత్రల్లో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రల్లో నటిస్తున్న యాంకర్లకు షాకులు తగులుతున్నాయి.యాంకర్ సుమ జయమ్మ పంచాయితీ సినిమాలో నటించగా ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకోలేదనే సంగతి తెలిసిందే.
పరిమిత బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది.
"""/" /
మరో యాంకర్ అనసూయ తాజాగా నటించిన దర్జా సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకోలేదనే సంగతి తెలిసిందే.
క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అనసూయ సక్సెస్ అవుతున్నా ప్రధాన పాత్రల్లో అనసూయ నటిస్తున్న సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకోవడం లేదు.
మరో యాంకర్ రష్మీ పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది.రష్మీ హీరోయిన్ గా నటించిన సినిమాలేవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకోలేదు.
"""/" /
బుల్లితెరపై ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించిన యాంకర్లు వెండితెరపై సక్సెస్ సాధించకపోవడానికి కారణలేంటనే ప్రశ్నకు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రష్మీ, అనసూయ, సుమ భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో సక్సెస్ లను సొంతం చేసుకుంటారో లేదో చూడాల్సి ఉంది.
ఈ బుల్లితెర యాంకర్ల జాతకం అస్సలు బాలేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
హెయిర్ బ్రేకేజ్ కు చెక్ పెట్టే బెస్ట్ అండ్ న్యాచురల్ టానిక్ ఇది.. డోంట్ మిస్!