లవ్ స్టోరీ తర్వాత పెరిగిన రాజీవ్ కనకాల రేంజ్.. రోజుకు రెమ్యునరేషన్ ఎంతంటే?

తెలుగులో నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దాదాపుగా రెండు దశాబ్దాల నుంచి రాజీవ్ కనకాల కెరీర్ ను కొనసాగిస్తున్నారు.

ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన సినిమాల్లో రాజీవ్ కనకాల ఎక్కువగా నటించారు.ఎన్టీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ లో రాజీవ్ కనకాల ఒకరు కాగా ఎన్టీఆర్ దర్శకులను కోరి మరీ రాజీవ్ కనకాలకు తన సినిమాల్లో అవకాశాలు ఇప్పించారు.

కొన్ని పాత్రలకు తను మాత్రమే పూర్తిస్థాయిలో న్యాయం చేయగలనని రాజీవ్ కనకాల తన పాత్రల ద్వారా ప్రూవ్ చేశారు.

లవ్ స్టోరీ సినిమాలో సాయిపల్లవి బాబాయ్ పాత్రను రాజీవ్ కనకాల అద్భుతంగా పోషించారు.

కొంతమంది ప్రేక్షకుల నుంచి విమర్శలు వ్యక్తమవుతాయని తెలిసినా రాజీవ్ కనకాల మాత్రం రిస్కీ పాత్రలో నటించి ప్రేక్షకుల పొందారు.

అయితే లవ్ స్టోరీ తర్వాత రాజీవ్ కనకాల రేంజ్ తో పాటు పారితోషికం కూడా పెరిగిందని తెలుస్తోంది.

ప్రస్తుతం రాజీవ్ కనకాల రోజుకు లక్ష రూపాయల పారితోషికం తీసుకుంటున్నారని సమాచారం.లవ్ స్టోరీ సక్సెస్ వల్ల రాజీవ్ కనకాలకు డిమాండ్ మరింత పెరిగింది.

"""/"/ యంగ్ జనరేషన్ హీరోల నుంచి స్టార్ హీరోల వరకు అందరి సినిమాలలో తారక్ కు ఆఫర్లు వస్తున్నాయి.

దర్శకనిర్మాతలు రాజీవ్ కనకాలకు ఆఫర్ చేస్తున్న పాత్రలలో నెగిటివ్ రోల్స్ ఎక్కువగా ఉన్నాయి.

రాజీవ్ కనకాల క్రేజ్ ఉన్న సమయంలోనే ఆ క్రేజ్ ను క్యాష్ చేసుకుంటూ కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు.

"""/"/ రాజీవ్ కనకాల భవిష్యత్తు ప్రాజెక్టులు కూడా హిట్టైతే అతనికి క్రేజ్ మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.

శేఖర్ కమ్ముల రాజీవ్ కనకాల కెరీర్ ను మలుపు తిప్పాడని చెప్పాలి.రాజీవ్ కనకాల కొత్త సినిమాలకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

పలు టీవీ షోలకు రాజీవ్ కనకాల గెస్ట్ గా కూడా హాజరవుతున్నారు.

గర్ల్‌ఫ్రెండ్ కోసం ఫ్రెండ్‌ని చంపేసిన యువకుడు.. ఎంత సిల్లీ విషయంలో గొడవ వచ్చిందంటే..??