రైలు ఆగకముందే డోర్ దగ్గర నిలబడుతున్నారా? అయితే ఈ వీడియో మీ కోస‌మే...

రైలులో ప్ర‌యాణిస్తున్న మీరు దిగాల‌నుకుంటున్న స్టేషన్ చేరేలోపు రైలులోని సీటు వదిలేసి, డోర్ దగ్గరకు వస్తున్నారా? అవున‌ని స‌మాధానం చెబితే మీరు ఈ వీడియోను తప్పక చూడండి.

ఈ వీడియోలో రైలు గేటు దగ్గర ఓ మహిళ, ఓ వృద్ధుడు నిలుచున్నారు.

రైలు నెమ్మదిగా నడుస్తోంది.ఇంతలోనే ఓ యువకుడు కదులుతున్న రైలు ఎక్కి మహిళ నుంచి బ‌ల‌వంతంగా పర్సు లాక్కొని పారిపోయాడు.

ఈ ఘటన అంతా అక్కడి సీసీటీవీలో రికార్డవ‌డంతో దానిని చూసిన‌వారంతా అవాక్క‌వుతున్నారు.ఇలాంటి ఘటనలు ఒక్కొక్క‌సారి ప్ర‌యాణికుల్లో మనోధైర్యాన్ని దెబ్బ‌తీస్తుంటాయి.

ఇదే కోవ‌లో నివాస ప్రాంతాల్లో కూడా చైన్ స్నాచింగ్‌లకు సంబంధించిన అనేక కేసులు నమోదవుతూనే ఉంటాయి.

ఇలాంటి పరిస్థితుల్లో ఇటువంటి నేరాలను అరికట్టేందుకు పోలీసులు కఠిన చ‌ర్య‌ల‌ను అవలంబించాలని ప్రజలు కోరుతున్నారు.

తద్వారా పౌరులు ప్రశాంతంగా ఉండ‌గ‌లుగుతార‌ని చెబుతున్నారు.వైర‌ల్ అయిన‌ ఈ 1.

05 నిమిషాల వీడియోలో, రైలు కోచ్ గేట్ వద్ద ఒక మహిళతో పాటు ఒక వృద్ధుడు నిలుచుని ఉన్నట్లు మనం చూడవచ్చు.

ఆ స‌మ‌యంలో రైలు నెమ్మదిగా కదులుతోంది.బయట చీకటిగా ఉంది.

అకస్మాత్తుగా ఓ యువకుడు ట్రాక్‌పై నుంచి పరుగుప‌రుగున‌ వచ్చి రైలు ఫుట్‌బోర్డ్‌పైకి ఎక్కి అక్కడే నిలబడిన మహిళ పర్సు లాక్కొని వెంట‌నే పారిపోయాడు.

"""/"/ ఈ స‌మ‌యంలో ఆ పెద్దాయన ఎలాగోలా ఆ మ‌హిళ‌ కింద పడిపోకుండా కాపాడాడు.

ఒక వ్యక్తి ఆ దొంగ‌ను ప‌ట్టుకునేందుకు ప్ర‌య‌త్నిస్తాడు.అయితే మహిళ పర్సు లాక్కున్న యువకుడు కాల్పులు జరిపాడ‌ని అంటున్నారు.

ఈ సీసీటీవీ ఫుటేజీ ఫిబ్రవరి 2020 నాటిదని వీడియో ద్వారా తెలుస్తుంది.ఈ వీడియో డిసెంబర్ 29న ఎస్‌సీఐబీ హెడ్‌క్వార్టర్స్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుండి పోస్ట్ అయ్యింది.

క్యాప్షన్‌లో అధికారులు.జాగ్రత్తగా ఉండండి.

రైలు ఆగే వ‌ర‌కూ డోర్ ద‌గ్గ‌ర‌కు రావద్దు, లేకుంటే మీకు కూడా ఇలాంటి సంఘటన ఎదుర‌వుతుంద‌ని రాశారు.

ఈ వీడియోకు లక్షకు పైగా వ్యూస్‌ ద‌క్క‌గా, 4 వేలకు పైగా లైక్‌లు వచ్చాయి.

వందలాది మంది వినియోగదారులు దీనిపై స్పందిస్తున్నారు.ఒక యూజ‌ర్‌.

అలాంటి వారిని పోలీసులు ఎందుకు పట్టుకోరని ప్ర‌శ్నించ‌గా, భార‌తీయ‌ రైల్వేలు ఆటోమేటిక్ డోర్లను ప్రవేశపెట్టాలని కొందరు సూచించారు.

కొంతమంది వినియోగదారులు దీనిని రైల్వే అధికారుల‌ నిర్లక్ష్యం అని ఆరోపించారు.ఈ వీడియోను అనే ట్విట్ట‌ర్ అకౌంట్‌లో చూడ‌వ‌చ్చు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – అక్టోబర్3, గురువారం2024