కేవలం దైవదర్శనాల కోసం కేసీఆర్ వచ్చారు.... థర్డ్ ఫ్రంట్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన స్టాలిన్

తెలంగాణ సి ఎం కేసీఆర్ సోమవారం చెన్నై లో డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ తో భేటీ అయి చర్చించిన సంగతి తెలిసిందే.

అయితే నిన్న కేసీఆర్ తో భేటీ అయిన తరువాత మంగళవారం స్టాలిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

భాజపా,కాంగ్రెస్ లేకుండా మూడో కూటమి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంది అని నాకు అనిపించడం లేదు అంటూ స్టాలిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

లోక్ సభ ఎన్నికల ఫలితాల తరువాత దీనిపై స్పష్టత వస్తుంది అని అన్నారు.

అలానే కేసీఆర్ చెన్నై వచ్చింది సమాఖ్య కూటమికి మద్దతు కోరేందుకు కాదని,దైవదర్శనాల కోసం అంటూ స్టాలిన్ వ్యాఖ్యానించారు.

ఈ నేపథ్యంలో మర్యాదపూర్వకంగా కలిసేందుకే నా అపాయింట్మెంట్ కోరారు.అంతే’ అని స్టాలిన్ మీడియాతో మాట్లాడుతూ అన్నారు.

అయితే తెలంగాణ సీఎంతో భేటీ జరిగిన మరుసటి రోజే.సమాఖ్య కూటమిపై స్టాలిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం తో ఇప్పుడు ఇది చర్చనీయాంశంగా మారింది.

సి ఎం కేసీఆర్ కేంద్రం లో కాంగ్రెస్,బీజేపీ లకు ప్రత్యామ్న్యాయంగా థర్డ్ ఫ్రంట్ ని ఏర్పాటు చేయాలని పలు రాష్ట్రాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే స్టాలిన్ ను కూడా కలిసి కాసేపు చర్చించారు.అయితే కేసీఆర్ కేవలం తన ఆలోచనలు మాత్రమే పంచుకున్నారు.

సమాఖ్య కూటమి కి ఎలాంటి మద్దతు కోరలేదు అంటూ స్టాలిన్ మీడియా కు వివరించారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మే8, బుధవారం 2024