SSMB28 షూట్ పై క్లారిటీ.. అన్ని చక్కబడిన తర్వాతనే..
TeluguStop.com
సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవలే సర్కారు వారి పాట సినిమాతో ఘన విజయం అందుకున్నాడు.
మరి ఈ సినిమా విజయం సాధించిన తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో నెక్స్ట్ సినిమా కమిట్ అయ్యాడు.
ఈ కాంబో ఇప్పటికే రెండు సార్లు కలిసి సినిమాలు చేసారు.ఇక ఇప్పుడు మూడవసారి ఈ కాంబోలో సినిమా తెరకెక్కుతుండడంతో ఫ్యాన్స్ ఎగ్జైట్ గా ఎదురు చూస్తున్నారు.
ఇదిలా ఉండగా ఈ సినిమా ఇటీవలే షూట్ స్టార్ట్ చేసుకుని ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది.
ఇక సెకండ్ షెడ్యూల్ కోసం కూడా రెడీ అవుతున్న సమయంలో మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి మరణించింది.
ఇక కొద్దిరోజులు మహేష్ ఈ సినిమాకు గ్యాప్ ఇచ్చాడు.ఇక డిసెంబర్ లో సెట్స్ మీదకు వెళుతుంది అనే టైం లో మళ్ళీ మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ మరణించడంతో మరో సారి బ్రేక్ వచ్చింది.
కృష్ణ హఠాత్మరణంతో ఈ సినిమా ఆగిపోయింది.తండ్రి మరణంతో మహేష్ కూడా ఢీలా పడిపోయారు.
అందుకే కొద్దీ రోజుల బ్రేక్ తర్వాత ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఎదురు చూసారు.
పరిస్థితులు చక్కబడిన తర్వాతనే ఈ సినిమా కొత్త షెడ్యూల్ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
తదుపరి షెడ్యూల్ కు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే ఫిక్స్ చేసి అనుకున్న విధంగానే పక్కాగా షూట్ పూర్తి చేసి రిలీజ్ చేస్తారా లేదా అనేది ముందు ముందు తెలుస్తుంది.
"""/"/
ఇక ఈ సినిమాలో మహేష్ కు జోడీగా బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది అని ఎప్పుడో ఫిక్స్ చేసారు.
అలాగే హారిక హాసిని బ్యానర్ పై రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ లో ఏప్రిల్ 28న రిలీజ్ చేస్తామని ప్రకటించారు.
అద్భుతం, అడవి జంతువుకు దైవభక్తా.. శివలింగాన్ని హత్తుకున్న ఎలుగుబంటి వీడియో వైరల్!