‘SSMB28’ నెక్స్ట్ షెడ్యూల్ అప్డేట్.. సూపర్ స్టార్ రాగానే షూట్ స్టార్ట్!
TeluguStop.com
సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా పూజా హెగ్డే ( Pooja Hegde ), శ్రీలీల ( SreeLeela ) హీరోయిన్ లుగా స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ ( Trivikram ) శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ''SSMB28''.
మొన్నటి వరకు ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంది.ముందు నుండి భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా షూటింగ్ కు తాజాగా బ్రేక్ ఇచ్చారు.
ఇక ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ రావడంతో మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి విదేశాలకు కూడా వెకేషన్ కోసం వెళ్లారు.
మరి మహేష్ బాబు వెకేషన్ కు వెళ్లడంతో ఈ సినిమా షూటింగ్ ఎన్ని రోజులు గ్యాప్ వచ్చిందో అని అంతా అనుకుంటున్నారు.
అయితే తాజాగా వస్తున్న బజ్ ప్రకారం ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ ఈ నెల ఆఖరున స్టార్ట్ చేయబోతున్నట్టు తెలుస్తుంది.
"""/" /
చూడాలి మరి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారో.
ఇక ఇటీవలే సూపర్ స్టార్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా సోషల్ మీడియాను షేక్ అయ్యింది.
ఊర మాస్ లుక్ లో మహేష్ షేక్ చేయడంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి.
ఫస్ట్ లుక్ తో పాటు ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి ( Sankranti 2024 ) కానుకగా జనవరి 13న రిలీజ్ చేస్తున్నట్టు కూడా అనౌన్స్ చేసి సర్ప్రైజ్ ఇచ్చారు.
"""/" /
ఇక ఈ సినిమాను హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
ఇక జగపతిబాబు నెగిటివ్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.
అలాగే ఈ సినిమాకు సంబంధించిన ఓటిటి హక్కులతో పాటు ఆడియో రైట్స్ కూడా భారీ ధరకు అమ్ముడుపోయి రిలీజ్ కు ముందే సెన్సేషన్ సృష్టించాయి.
మరి రిలీజ్ తర్వాత ఈ సినిమా ఎంత సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
వైరల్ వీడియో: ఇలా చేస్తే ఎలా విరాట్.. సింగల్ డిజిట్‌కే పెవిలియన్‌కు