మహేష్ రాజమౌళి కాంబో మూవీలో హీరోయిన్ ఫిక్స్.. ఈ హాలీవుడ్ బ్యూటీ ఎవరంటే?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి( SS Rajamouli ) అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) కాంబినేషన్ లో ఒక మూవీ రాబోతున్న విషయం తెలిసిందే.

ఈ సినిమా ఇంకా పట్టాలెక్కకముందే ఈ సినిమాపై అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పనుల్లో భాగంగా అటు రాజమౌళి మహేష్ బాబు ఫుల్ బిజీ బిజీగా ఉన్నారు.

ఇప్పటికే మహేష్ బాబు ఈ సినిమా కోసం తన లుక్ ని కూడా చేంజ్ చేసిన విషయం తెలిసిందే.

గడ్డాలు మీసాలతో గుర్తుపట్టలేని విధంగా మారిపోయారు మహేష్ బాబు.ఇప్పటికే మహేష్ బాబు లుక్ కి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే.

ఈ సినిమా పాన్‌ వరల్డ్‌( Pan World ) రేంజ్‌ లో తెరకెక్కనుంది.

అందుకే ఈ చిత్రంలో నటించే యాక్టర్స్‌ పై ప్రత్యేక దృష్టి పెట్టారు రాజమౌళి.

భారతదేశ నటీ నటులే కాకుండా హాలీవుడ్‌ కు( Hollywood ) చెందిన వారిని కూడా ఈ ప్రాజెక్టు లోకి తీసుకోనున్నారాయన.

అందులో భాగంగా మహేశ్‌ బాబుకి జోడీగా హాలీవుడ్‌ నటి నవోమీ స్కాట్‌ ని( Naomi Scott ) ఎంపిక చేసుకోనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

"""/" / అయితే గతంలో ఎస్‌ఎస్‌ఎమ్‌బి 29 హీరోయిన్ల జాబితాలో బాలీవుడ్‌ బ్యూటీ దీపికా పదుకోన్, ఇండోనేషియాకు చెందిన చెల్సియా ఇస్లాన్‌ పేర్లు వినిపించాయి.

తాజాగా భారత మూలాలు ఉన్న నవోమీ స్కాట్‌ ని ఎంపిక చేయనున్నారని భోగట్టా.

ఇంగ్లాండులో పుట్టారు నవోమి.భారత సంతతికి చెందిన నవోమి తల్లి ఉషా స్కాట్‌ గుజరాత్‌ నుంచి ఇంగ్లాండుకు వలస వెళ్లారట.

ది మార్షియన్, అల్లాద్దీన్, ఛార్లీస్‌ ఏంజెల్స్, స్మైల్, విజర్డ్స్‌ వంటి పలు సినిమాల్లో నటించిన నవోమీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు.

"""/" / ఎస్‌ఎస్‌ఎమ్‌బి 29సినిమాలో( SSMB 29 ) నటించే విషయంపై ఆమెతో రాజమౌళి చర్చలు కూడా జరిపారని ఫిల్మ్‌ నగర్‌ సర్కిల్‌ లో వార్తలు వినిపిస్తున్నాయి.

మరి మహేశ్‌ బాబుకి జోడీగా నవోమీ స్కాట్‌ ఖరారు అయినట్టేనా? అంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి.

దుర్గా ఆర్ట్స్‌ పతాకం పై కేఎల్‌ నారాయణ నిర్మించనున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనులు శర వేగంగా జరుగుతున్నాయి.

అయితే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ సినిమాకు సంబందించిన షూటింగ్‌ ప్రారంభం కానుందని టాక్‌.

ఈ విషయంపై ఇంకా మరింత సమాచారం తెలియాల్సి ఉంది.