జక్కన్న, ఆయన భార్యకు అరుదైన గౌరవం.. ఏం జరిగిందో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

తెలుగు ప్రేక్షకులకు టాలీవుడ్ దర్శకదీరుడు ఎస్ ఎస్ రాజమౌళి( SS Rajamouli ) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఆర్ఆర్ఆర్ సినిమాతో దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నారు రాజమౌళి.ఈ సినిమాతో తెలుగు సినిమా సత్తాను చాటారు.

ఇకపోతే రాజమౌళి భార్య రమా రాజమౌళి( Rama Rajamouli ) గురించి కూడా మనందరికీ తెలిసిందే.

ఆమె తన భర్తకు చేదోడువాదోడుగా ఉంటూ అనేక విషయాల్లో భర్తకు హెల్ప్ చేస్తూ ఉంటారు.

ఇది ఇలా ఉండి తాజాగా రాజమౌళితో పాటు ఆయన భార్య రమా రాజమౌళి కూడా ఒక అరుదైన ఘనత దక్కింది.

"""/" / ఆస్కార్‌ అకాడమీలో( Oscar Academy ) చేరేందుకు ఆహ్వానం అందుకున్నారు.

దర్శకుల కేటగిరిలో రాజమౌళి కాస్ట్యూమ్‌ డిజైనర్‌ జాబితాలో రమా రాజమౌళి ఈ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు.

ఈ సంవత్సరం మొత్తం 57 దేశాల నుంచి 487 మంది సభ్యులకు ఆస్కార్‌ అకాడమీ ఆహ్వానం పంపింది.

అందులో భారత్‌ నుంచి వీరిద్దరితో పాటు మరికొందరు సినీ ప్రముఖులు కూడా ఉన్నారు.

షబానా అజ్మి, రితేశ్‌ సిద్వానీ, రవి వర్మన్‌ తదితరులు అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్స్‌ అండ్‌ ఆర్ట్స్‌ ఆహ్వానం అందుకున్నారు.

"""/" / అయితే తాజాగా దీనిపై అకాడమీ పోస్ట్‌ చేస్తూ.ఈ సంవత్సరం కొత్త సభ్యులకు ఆహ్వానం పంపుతున్నందుకు సంతోషిస్తున్నాము.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులైన కళాకారులు, నిపుణులకు అకాడమీ స్వాగతం పలుకుతోంది అని పేర్కొంది.

ఇక టాలీవుడ్‌ నుంచి గత ఏడాది కొందరు ప్రముఖులు ఈ అకాడమీలో చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే.

ఆర్‌ఆర్‌ఆర్‌ లో( RRR ) నటించిన రామ్ చరణ్‌, ఎన్టీఆర్‌ లతో పాటు కీరవాణి, సెంథిల్‌ కుమార్‌ గతంలో ఈ అకాడమీలో సభ్యత్వం సాధించారు.

ఓవరాక్షన్ చేసిన పోలీస్.. ట్రక్ డ్రైవర్‌ ఇచ్చిన ట్విస్ట్‌కి పరార్.. (వీడియో)